Pages

25, అక్టోబర్ 2013, శుక్రవారం

నీళ్లు..నిధులే కీలకం

రాష్ట్ర విభజనపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో జలవనరులు, ఆర్థిక వనరులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్థిక, ప్రణాళిక సంఘం, న్యాయ, హోం, పాలనాసిబ్బంది, విద్యుత్‌, బొగ్గు, నీటిపారుదల...మొత్తం తొమ్మిది ముఖ్య శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విభజనపై సమగ్రంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో పరిస్థితిపై హోంశాఖకు అన్ని శాఖల సంక్షిప్తంగా వివరాలను అందించాయి. అయితే, మరో రెండురోజుల్లో పూర్తి స్థాయి వివరాలు ఇవ్వాలంటూ హోంశాఖ కోరింది. బిల్లును ఎలా రూపొందించాలన్నదానిపైనా ఈ భేటీలో చర్చ జరిగింది. డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో, తెలంగాణ బిల్లును వేగంగా తయారు చేసేందుకు హోంశాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి