రాష్ట్రవిభజనను ముందునుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మరోసారి ఈ వ్యవహారంలో స్పందించారు. విభజన అంశంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారాయన. రాష్ట్ర విభజన రాజ్యాంగబద్ధంగా మాత్రమే జరగాలని సీఎం లేఖలో కోరారు. గతంలో ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను రాజ్యాంగ బద్ధంగానే ఏర్పాటు చేశారని, తెలంగాణ విషయంలోనూ అదే ప్రక్రియను అనుసరించాలని కోరారు సీఎం. విభజనపై తమకు అనేక అనుమానాలున్నాయని, మంత్రుల బృందంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని సభ్యుడిగా చేర్చకపోవడంతో అవి మరింత ఎక్కువయ్యాయని లేఖలో పేర్కొన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి