Pages

15, డిసెంబర్ 2010, బుధవారం

వామ్మో తాజ్...


తాజ్‌మహల్‌ చూశారా...? ఒక్కసారి కూడా చూడలేదా...? అయితే తక్షణమే ఆగ్రా వెళ్లండి... తాజ్‌ అందాలు తనివితీరా ఆస్వాదించండి...అంత హడావుడి ఎందుకంటారా...? ఇకపై తాజ్‌ వంటి ప్రాచీన కట్టడాలు చూడటానికి ... టికెట్‌ ధర వేలల్లో ఉండబోతోందట... అవాక్కయ్యారా...?
తాజ్‌మహల్‌.... అజరామరమైన ప్రేమకు చిహ్నం...
ప్రేమికుల పాలిట స్వర్గం...
ప్రపంచంలోని ఏడువింతల్లో ఒకటిగా...
భారత్‌ కీర్తిని ఇనుమడింప చేసిన అందాల కట్టడం...
అలాంటి తాజ్‌మహల్‌ చూడాలంటే...
కోటీశ్వరులకే సాధ్యమా...?
కనీసం లక్షాధికారులై ఉండాలా...?
లక్షలు, కోట్లకు ... తాజ్‌మహల్‌కు సంబంధమేంటి...?
ఇది నిజం.... అందాల తాజ్‌మహల్‌ సందర్శన... సామాన్యుడికి కలలో మాట కానుంది.... ఒక్క తాజ్‌మహల్‌ మాత్రమే కాదు... ఈజిప్ట్‌లోని చారిత్రక గిజా పిరమిడ్స్‌ ... ది గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా.... ఇంకా అడుగడుగునా పిల్లకాలువలతో సర్వాంగ సుందరంగా కనిపించే వెనిస్‌ నగరం... ఇవన్నీ చూడాలంటే పెట్టిపుట్టాలి... తాజ్‌ వంటి చారిత్రక కట్టడాల దగ్గరికి వెళ్లటం... వాటిని చేత్తో తాకటం... సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కలగానే మిగలనుంది....  ఎందుకో తెలుసా..? ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న టూరిస్టులే.
టూరిస్టులు.. టూరిస్టులు... ఎక్కడ చూసినా వాళ్లే... ఒక్కో రోజు వేల సంఖ్యలో వచ్చే పర్యాటకులు... తాజ్‌మహల్‌ వంటి అరుదైన, ప్రాచీన కట్టడాల్లోకి దూసుకుపోతున్నారు... ఫోటోలు తీసుకుంటే ఫర్వాలేదు... రకరకాల తినుబండారాలు, కూల్‌డ్రింకుల వ్యర్థాలతో ... చారిత్రక కట్టడాల ప్రాంగణాలను నింపుతున్నారు... రోజూ వందలు, వేల సంఖ్యలో మనుషులు... వాళ్లను మోసుకురావటానికి రకరకాల వాహనాలు.... అంటే... టన్నుల కిలోల బరువు మోస్తున్న చారిత్రక కట్టడాలు...వాటి ప్రాంగణాలు...  గుంపులు గుంపులుగా సంచరించే పర్యాటకుల బరువుతో... కుంగిపోతున్నాయట... ఇది ఇలాగే కొనసాగితే... మాస్‌ టూరిజం బారిన పడి... మన హెరిటేజ్‌ సైట్స్‌.... మరో 20 ఏళ్లలో కుప్పకూలటం ఖాయమని పురావస్తు శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలంటే... కొన్ని కఠినమైన నిబంధనలు తప్పనిసరని పురావస్తువేత్తలు అంటున్నారు. దానిలో భాగంగానే... తాజ్‌మహల్‌ వంటి వరల్డ్‌ హరిటేజ్‌ సైట్లను సందర్శించాలంటే... టికెట్‌ ధరను ఊహించలేనంత భారీగా పెంచనున్నారు...  బ్రిటన్‌ వంటి దేశాల్లో ఇప్పటికే ... బస్సులు, రైళ్ల వంటి ప్రజాప్రయాణ సాధనాల్లో వచ్చిన టూరిస్టులను మాత్రమే ప్రాచీన కట్టడాల దగ్గరికి అనుమతిస్తున్నారు. అలాగని... తాజ్‌మహల్‌ను సామాన్యుడు చూడలేడా....? ఇదే కదా మీ సందేహం... అందుకూ ఓ మార్గం సూచిస్తున్నారు... ఆర్కియాలజీ నిపుణులు.... తాజ్‌ వంటి కట్టడాలకు సమీపంలోనే ఓ ప్లాట్‌ఫారం నిర్మిస్తారు... తాజ్‌ లోపలికి వెళ్లటానికి భారీ ఖరీదును భరించలేని వాళ్లు... ఆ ప్లాట్‌ఫారం మీద నుంచి తాజ్‌ వంటి కట్టడాల అందాలను చూసి ఫ్రీగా మురిసిపోవచ్చు... అలాకాదు... ఎంత ఖరీదైనా... తాజ్‌మహల్‌ లోపలికి వెళ్లి చూస్తాం... పరవశించి పోతాం అనుకుంటే మాత్రం... మీకేదైనా లక్కీ లాటరీ తగిలితేనే అది సాధ్యం... ఎందుకంటే... టికెట్‌ ధర ఆ రేంజ్‌లో ఉంటుంది మరి.ఇప్పుడేమంటారు... వహ్‌ తాజ్‌ అనా... వామ్మో తాజ్‌ అనా....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి