Pages

15, డిసెంబర్ 2010, బుధవారం

ఖలీఫా లో కలలు కనండి..


దుబయ్‌ బుర్జ్‌ ఖలిఫా....
828 మీటర్ల ఎత్తైన భవనం....
ఆకాశాన్ని తాకుతున్నట్లుంటే రాజసౌధం
ప్రపంచంలోనే ఎత్తైన భవంతి..
188 అంతస్తులు.. 900 అపార్ట్‌మెంట్లు..
144 పుల్లీ ఫర్నీష్డ్‌ అపార్ట్‌మెంట్స్‌....
122వ అంతస్తులో రెస్టారెంట్‌....
124వ అంతస్తులో ఎత్తైన అబ్జర్వేటరీ డెక్‌....
ఒక్కో అపార్ట్‌మెంట్ ఖరీదు కోట్లల్లో ఉంటుంది..
ఇంతటి అద్భుతమైన సౌధంలో.. ఒక్కరోజైనా గడపాలని ఉందా....!

కలలు కనటానికీ ఓ హద్దుండాలని భయపడుతున్నారా...? మీకా భయమే వద్దు..  ఎందుకంటే అందులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక రాత్రి  స్టే చేయడం ఇప్పుడు చాలా చౌక.. ఎంతంటే... ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఒకరోజు బస చేయడానికి అయ్యేంత మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. జస్ట్‌ 15వేలు.. కేవలం 15వేలు మీవి కాదనుకుంటే.. వరల్డ్‌లోనే అత్యంత ఎత్తైన బుర్జ్‌ ఖలిఫా బిల్డింగ్‌లో ఒక రాత్రి హాయిగా ఎంజాయ్‌ చేయవచ్చు. కేవలం 15వేల రూపాయలే అంటున్నారు... అలా వెళ్లి ఇలా రావటమేనా... అనుకుంటున్నారా...? ఆ డౌటేం వద్దు... రెంట్‌ తక్కువైనా సౌకర్యాలకు కొదవేమి ఉండదు.. జస్ట్‌ 15వేల రూపాయలకే.. డబుల్‌ బెడ్‌రూమ్‌.. రెండు సోఫాలు.. ఫుల్లీ ఎయిర్‌ కండీషన్‌ రూమ్స్‌.. కంప్యూటర్‌ విత్‌ వైర్‌లెస్‌ వైఫై యాక్సెస్‌ ఉంటుంది. కానీ... కేవలం నలుగురు మాత్రమే ఉండాలి...
అయితే... ఇక్కడో ట్విస్ట్‌ ఉంది... 15వేల రూపాయలే కదా పోతేపోనీ.. ఎంచక్కా.. బుర్జ్‌ ఖలిఫాలోని 188వ అంతస్తులో బస చేయొచ్చనుకుంటే మాత్రం అది... అత్యాశే అవుతుంది.. ఎందుకంటే.. మీ వసతి మాత్రం 19వ అంతస్తుకే పరిమితం.... ఆలస్యం చేశారో.. ఈ ఛాన్స్‌ కూడా ఉండకపోవచ్చు...!!!! అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఆన్‌లైన్‌ సంస్థ ఈ లాభసాటి డీల్‌ను ఆఫర్‌ చేస్తోంది.. బుర్జ్‌ ఖలిఫాలో
 స్టే చేయడానికి ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. మైదుబయ్‌స్టే డాట్‌ కామ్‌లో లాగిన్‌ అయితే చాలు.. ఇంకెందుకు లేటు... త్వరగా బుక్‌ చేసేయండి మరి.. హ్యాపీ జర్నీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి