రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించడానికి నిరసనగా, ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగు ప్రజలను వంచించిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని, తెలుగు ప్రజల భవిష్యత్తే అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మరికాసేపట్లో ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. నవంబర్ 25, 2010న ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్, మూడేళ్ల రెండు నెలల 19 రోజుల పాటు పదవిలో కొనసాగారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి