Pages

7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ

సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఒత్తిడితో రాష్ట్ర విభజన బిల్లుకు పలు సవరణలు సూచిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికను పాక్షికంగా ఆమోదించింది కేంద్ర కేబినెట్. రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతికి పంపి ఆయన్నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. వీలైతే వచ్చేవారం మొదటి మూడు రోజుల్లో విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనిపై విస్తృతంగా చర్చించింది. సీమాంధ్ర సమస్యలపైనే కేంద్రమంత్రి కావూరి అరగంటకుపైగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను తోసి పుచ్చిన కేంద్ర కేబినెట్, గతంలో ఆమోదించిన పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. అయితే, పోలవరం ముంపు గ్రామాలను పూర్తిగా సీమాంధ్రలోనే కలపాలని, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీమాంధ్ర కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుంది కేంద్రం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి