Pages

25, అక్టోబర్ 2013, శుక్రవారం

హస్తినకు ఏల పోవలె?

రాష్ట్ర విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కోరింది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల బృందం. విభజన విషయంలో జరుగుతున్న తాజా పరిణామాలను ఆయనకు వివరించింది. దాదాపు అరగంట సేపు జరిగిన ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన వివరాలను ప్రణబ్ సావధానంగా ఆలకించినట్లు సమాచారం. అయితే, ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయనట్లు తెలుస్తోంది. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విభజన ప్రక్రియన జరుగుతోందని చెప్పిన సీమాంధ్ర నేతలు, దాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతిని కోరారు. రెండు రోజుల్లో ఈ విషయంపై ప్రణబ్ ఏదో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రణబ్‌తో భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యింది సీమాంధ్ర మంత్రుల బృందం. అసెంబ్లీకి తీర్మానంపై క్లారిటీ కావాలని ఆయన్ను నిలదీశారు నేతలు. అసెంబ్లీకి తీర్మానం పంపించకపోతే ఊరుకునేది లేదనీ తేల్చి చెప్పారు. అయితే, ఈ విషయంలో హోంమంత్రి షిండేతో మాట్లాడిన తర్వాతే స్పష్టత ఇస్తానని డిగ్గీరాజా తేల్చేశారు. అంతేకాదు, సమావేశం అనంతరం మీడియా ముందుకు ఆ బృందాన్ని వెంటేసుకువచ్చి మరీ, విజజన విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని, సీమాంధ్రకు మంచి ప్యాకేజీ ఇస్తామంటూ చెప్పేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. "ఎమ్మెల్యేలు, మంత్రుల బృందం నన్ను కలవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విషయంలో మేం అందరం కలిసే ఉన్నాం. సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, సీమాంధ్ర ప్రజలకు వీలైనంత మంచి ప్యాకేజీ ఇవ్వడానికి మేమందరం ప్రయత్నిస్తున్నాం. అది హైదరాబాద్‌లో ఉన్న ప్రజలందరి భద్రతైనా, సీమాంధ్ర విద్యార్థులకు హైదరాబాద్‌లో ఉన్న విద్యావకాశాలైనా, హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులకైనా ఎంత మంచి ప్యాకేజీ ఇవ్వగలిగితే దాన్ని ఇస్తాం. కోస్తా, వెనుకబడిన ప్రాంతాలు, రాయలసీమల్లో  ఉన్న కష్టాలు గురించి కూడా ఆలోచిస్తున్నాం. విభజన జరిగిన తర్వాత కూడా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజల మధ్య మంచి అనుబంధం ఉండేలా చూడడానికి ప్రయత్నిస్తున్నాం." సీమాంధ్ర నేతల ముందే ఈ విషయం చెబుతున్నా అంతా సైలెంట్‌గా వింటూ ఉండిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి