Pages

24, అక్టోబర్ 2013, గురువారం

వెయ్యి కోట్లపైన్న కన్నేసిన క్రిష్

బాలీవుడ్లో ఇప్పుడు ఏ సినిమా గురించి విన్నా అది వందకోట్ల క్లబ్‌లో ఉందా రెండు వందల కోట్ల క్లబ్‌లో ఉందా అంటూ ప్రశ్నించడం సాధారణం అయిపోయింది. కొన్ని సినిమాలైతే 300 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించడమూ విశేషం. దీంతో సినిమా రిలీజ్‌కు ముందే దాని కలెక్షన్ల సత్తాను అంచనా వేసే పనిలో మునిగిపోతున్నారు ట్రేడ్ పండితులు. దాదాపు మూడేళ్లకు పైగా నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రిష్‌ -3 కలెక్షన్ల మీద కూడా జనంలో ఇప్పుడు భారీగా అంచనాలున్నాయి. హృతిక్ ఇంతకు ముందు ఈ సిరీస్‌లో నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం, మూడో సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ అద్భుతంగా ఉన్నట్లుగా ట్రయలర్స్‌లో కనిపిస్తుండడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న అంచనాలున్నాయి.

క్రిష్ -3 ఏ క్లబ్‌లో చేరుతుందంటూ మీడియా ప్రతినిధులు సినిమా నిర్మాత, హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్‌ను అడిగితే, వెయ్యికోట్ల క్లబ్ అంటూ సమాధానం ఇచ్చాడట. అయితే, ఏదో మాటవరసకు చెప్పినట్లు కాకుండా, ఆ రేంజ్‌లోనే వసూళ్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడట రాకేశ్ రోషన్. భారతీయ సినిమాకు హాలీవుడ్ మూవీ రేంజ్‌లో కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు సీనియర్ రోషన్. అన్నట్లు, ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ పూర్తిగా భారతీయ నిపుణులతోనే పనిచేయించడం విశేషం. ఈ సినిమా హిట్ అయితే, ఇండియన్ సినిమా లెవల్ మరింత పెరుగుతుందంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి