Pages

22, అక్టోబర్ 2013, మంగళవారం

శీలానికి చుక్కెదురు

రాష్ట్ర విభజన వ్యవహారంలో కేంద్రమంత్రుల ఓ స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌ను క్రమంగా పక్కన పెడుతూ, విభజన తర్వాత సీమాంధ్ర కోసం ఏం చేయాలన్న డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి జేడీ శీలం, హైదరాబాద్‌ను యూటీ చేస్తే సీమాంధ్రుల ఆందోళన తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకూడదని, సోనియా గాంధీని మెప్పించి, ఒప్పించి సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారాయన.

విజయవాడ వచ్చిన జేడీ శీలాన్ని సమైక్యవాదులు అడ్డగించారు. ఓ స్టార్ హోటల్లో ప్రెస్‌మీట్‌కు శీలం ఏర్పాట్లు చేసుకోగా, అదే జరిగితే హోటల్‌పై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, హోటల్ యజమాన్యం ప్రెస్‌మీట్‌కు అనుమతించలేదు. దీంతో హోటల్‌ బయటే మీడియాతో మాట్లాడారు శీలం. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ సమైక్య ఉద్యమకారులు మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేయడంతో ఆయన అసహనానికి గురయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి