Pages

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

కిలాడీ చిలుక

కొండను తవ్వి ఎలుకను పట్టారన్నది పాత సామెత. కానీ, కొలంబియా పోలీసులు మాత్రం డ్రగ్స్ మాఫియాపై దాడి చేసి ఓ చిలుకను పట్టుకున్నారు. ఇంతకీ ఇది అలాంటి ఇలాంటి చిలుక కాదు, కిలాడీ చిలుక. క్రిమినల్స్‌తో చేతులు కలిపి ఖాకీలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. 
ఇంతకీ ఇదేం చేస్తుందంటారా? ఇంటికి కాపలా కాస్తుంది. అంటే ఇంట్లోకి దొంగలు వస్తే అలెర్ట్ చేస్తుందని కాదు.. పోలీసులు వస్తే అప్రమత్తం చేస్తుంది. కొలంబియాలోని ఓ డ్రగ్ సప్లై ముఠా దీన్ని పెంచుకొంటోంది. ఇంటి ముందు చక్కగా పంజరంలో ఉండే ఈ చిలుక, పోలీసులు కనపడగానే కేకలు పెడుతుంది. దీని హెచ్చరికల ఆధారంగా డ్రగ్ ముఠా తప్పించుకుంటుందన్నమాట. ఎన్ని సార్లు రైడ్ చేసినా ఎవరూ దొరకకపోవడంతో, నిఘా పెట్టిన పోలీసులు అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. అంతే, పక్కాగా దాడి చేసి, ఈ చిలుకను అరెస్ట్ చేశారు. ప్ర్తత్యేకంగా వాహనంలో తరలించి రెస్క్యూ సెంటర్‌కు అప్పజెప్పారు. ఇంతవరకూ ఇలాంటి వెయ్యి దొంగ చిలుకలను అక్కడి పోలీసులు పట్టుకున్నారట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి