Pages

25, సెప్టెంబర్ 2010, శనివారం

ర్యాంప్‌పై పడబోయిన అతిలోకసుందరి

మిస్ యూనివర్స్‌లు, మిస్ వరల్డ్‌లు ఎంతమంది ఉన్నా... అతిలోక సుందరి అనగానే అందరికీ గుర్తొచ్చేది శ్రీదేవి మాత్రమే. ఎంతోమంది మగాళ్లకు కలల రాకుమారి శ్రీదేవి. పెళ్లై, పిల్లలు పుట్టినా, ఇప్పటికీ ఏమాత్రం వన్నె తగ్గని అందాలరాశి. అలాంటి శ్రీదేవి ర్యాంప్‌పై హొయలు వలకబోస్తే ఎలా ఉంటుంది.. ఇటీవల జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ఆ అవకాశం అందరికీ లభించింది. అద్భుతమైన డ్రస్‌తో షో స్టాపర్‌గా అందరినీ కనువిందు చేసింది శ్రీదేవి. అయితే, అలవాటు లేకపోవడమో ఏమో గానీ, ర్యాంప్‌పై కాస్త ఇబ్బంది పడింది. కాస్తుంటే పడిపోయేది కూడా, డ్రస్ కాళ్లకు తట్టుకోవడంతో చాలానే ఇబ్బంది పడింది. చివర్లో మళ్లీ మెరిసినా, ఈసారి మాత్రం డిజైనర్‌తో కలిసి వచ్చింది. కావాలంటే వీడియోలో చూడండి...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి