Pages

8, సెప్టెంబర్ 2014, సోమవారం

తొమ్మిదిన్నర చేరుకున్న బాలాపూర్ ప్రసాదం

గణేశ్ నిమజ్జనం అంటే ముందుగా అందరిదృష్టీ పడేది బాలాపూర్ లడ్డూపైనే. ఈ లడ్డూ కోసం సాగే వేలం పాటపై ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగువాళ్లూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  ఈ మహా ప్రసాదాన్ని దక్కించుకున్నవాళ్లకు ఎంతో కలిసివస్తుందన్న నమ్మకం ఏటా పెరుగుతున్నకొద్దీ.. లడ్డూ ధర కూడా పెరుగుతూ వస్తోంది. గత ఏడాది 9 లక్షల 26 వేల రూపాయలకు ఈ లడ్డూను సొంతం చేసుకున్న టీడీపీ నేత తీగల కృష్ణారెడ్డి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో, ఈ నమ్మకం మరింత ఎక్కువయ్యింది. దీంతో ఈ సారి కూడా లడ్డూవేలం పోటా పోటీగా మొదలయ్యింది.50 వేల రూపాయలతో మొదలైన వేలం పాట కొన్ని నిమిషాల్లోనే 9 లక్షలకు చేరుకుంది. చివరకు 9 లక్షల 50 వేల రూపాయలకు ఈ లడ్డూను సింగిరెడ్డి జైహింద్ రెడ్డి దక్కించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి