ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడతో పాటు చుట్టుపక్కల నగరాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరిలకు మెట్రో రైలు ప్రాజెక్టును ఇస్తామంటూ విభజన చట్టంలో చెప్పింది కేంద్రం. అయితే, ఈ మెట్రో రైలు బెజవాడలో పరుగులు పెడితే ఎలా ఉంటుందన్నదానికి దృశ్యరూపం ఇచ్చారు ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ విద్యార్థులు. అయితే మెట్రో రైలు బదులు, మోనో రైలును మోడల్ గా తీసుకున్నారు. విజయవాడలోని ప్రధాన ప్రాంతాలను వీడియో తీసి, నిజంగానే మోనో రైలు పరుగులు పెడుతున్నట్లుగా యానిమేషన్ సృష్టించి, తమ క్రియేటివిటీని చాటుకున్నారు. మీరూ ఆ వీడియోను ఓ సారి వీక్షించండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి