Pages

6, ఆగస్టు 2014, బుధవారం

30 ఏళ్లు.. 60 ట్రాన్స్‌ఫర్లు

నిజమే.. నిజాయతీగా పనిచేసినందుకు ఓ ఐఏఎస్ అధికారికి దక్కిన బహుమానమిది. 30 ఏళ్లలో ఆయన్ను ఏకంగా 60 సార్లు ట్రాన్స్‌ఫర్ చేసి తమ కక్ష తీర్చుకుంది ఆ ప్రభుత్వం.. ఒక్కనిమిషం మీరు ఊహిస్తున్నట్లు అతను సోనియా అల్లుడు వాద్రా భూముల వ్యవహారం బయటపెట్టిన అశోక్ ఖేమ్కా కాదు.. ఈయన ప్రదీప్ కాస్ని. ఈయన కూడా హర్యానాలోనే ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. అక్కడి సీఎం హుడా హడావుడిగా నియమించిన సమాచార కమిషనర్లకు అపాయింట్ ‌మెంట్ లెటర్లు ఇవ్వనందుకు ఆయన్ను లో ప్రొఫైల్ పోస్ట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు హుడా. 1984లో స్టేట్ సివిల్ సర్వీస్ లో చేరిన కాస్ని అంచెలంచెలుగా ఎదిగారు. 2006లో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన 30 నిమిషాల్లోనే ఆయనకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ అందింది. 2012లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ డైరెక్టర్ గా మూడురోజులు పనిచేయగానే మరో చోటకి బదిలీ అయ్యింది. ఇలాంటి అనుభవాలు ఆయనకు ఎన్నో. అయితే.. ఈ ట్రాన్స్‌ఫర్లు తనకు కొత్తేమీ కాదని.. ఎక్కడున్నా సమర్థవతంగా పనిచేయడమే తనకు తెలుసంటున్నారు ప్రదీప్ కాస్ని. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి