రాజకీయ పార్టీల అంచనాలకు అతీతంగా సీమాంధ్ర ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా తరలివచ్చారు. తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేశారు. అయితే, ఇంత భారీగా పోలింగ్ జరగడంతో, ఏ పార్టీకి విజయం దక్కుతుందన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలు విజయం తమదంటే తమదని చెబుతున్నా.. లోలోన మాత్రం కాస్త ఆందోళనగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఓటింగ్ సరళిని చూస్తుంటే, సీమాంధ్ర వైసీపీకే ఆధిక్యం దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి