Pages

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

సుప్రీంలోనూ మోహన్ బాబుకు ఎదురుదెబ్బ

పద్మశ్రీ వివాదంలో సుప్రీంను ఆశ్రయించినా మోహన్ బాబుకు ఉపశమనం లభించలేదు. దేనికైనా రెడీ సినిమా టైటిల్స్‌లో పద్మశ్రీ పేరును ఉపయోగించడంపై దాఖలైన పిటిషన్‌ను గతంలో విచారించిన హైకోర్ట్, పద్మశ్రీ బిరుదును వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశించింది. దీనిపై సుప్రీంను ఆశ్రయించారు మోహన్ బాబు. వివాదం తలెత్తిన తర్వాత ఎక్కడా బిరుదును ఉపయోగించలేదని, కాబట్టి, వెనక్కి ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను కొట్టి వేయాలంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది సోలీ సొరాబ్జీ ఆదేశించారు. అయితే, ఇకపై ఎప్పుడూ ఎక్కడా పద్మశ్రీ బిరుదును వాడుకోనంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది కోర్టు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి