సినిమాల్లో తాను లెజెండ్ అయినా.. పార్టీ విషయానికొచ్చే సరికి బావే లెజెండ్ అంటున్నాడు బాలయ్య. లెజెండ్ సినిమా విజయోత్సవ యాత్రను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆయన.. కరీంనగర్ జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గతంలో అసెంబ్లీకే పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించిన బాలయ్య.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి మాత్రం మాట మార్చే పనిలో పడ్డారు. ఈ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారాయన. పోటీ అయినా ప్రచారమైనా చంద్రబాబు నిర్ణయానికే కట్టుబడతానని ప్రకటించారు బాలయ్య. బావ చెబితే తెలంగాణలో ప్రచారం చేస్తానన్నారు నందమూరి నటసింహం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి