రాయల తెలంగాణను రాజకీయ నేతలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, ప్రజలెవరూ వ్యతిరేకించడం లేదన్నారు మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి. రాయలసీమను ఇప్పుడు కొత్తగా విడగొట్టడం లేదని, ఎప్పుడో విడిపోయిందన్నారాయన. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలన్నారు జేసీ. తమ రైతులు, ప్రజలు, ఉద్యోగుల ప్రయోజనార్థమే రాయలతెలంగాణను కోరుతున్నామన్నారాయన. కత్తులు, కొడవళ్లు తమ జిల్లా నుంచి ఎప్పుడో దూరమయ్యాయని, ఫ్యాక్షన్ అంతా పుత్తూరు, కృష్ణాలోనే ఉందన్నారు జేసీ. రాయల తెలంగాణ ఏర్పడితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారాయన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి