రణవీర్ సింగ్, దీపికా లతో సంజయ్ లీలా బన్సాలీ సృష్టించిన రామ్ లీలా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళుతోంది. అంతేకాదు, సినీ దిగ్గజాలంతా ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారట. ముఖ్యంగా బిగ్ బీ అమితాబ్ కైతే ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసిందంట. 24 గంటల్లోనే ఈ సినిమాను మూడుసార్లు చూశారట బచ్చన్ సాబ్. అంతేకాదు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తోందంటూ ఆయన బ్లాగ్ లో పేర్కొన్నారు. రామ్ లీలా నటీనటుల్లో ప్రొఫెషనలిజం కనిపిస్తోందని, భారతీయ సినిమాకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ప్రశంసించారాయన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి