Pages

26, జులై 2010, సోమవారం

నిధులు ఫలహారం

పేదల సంక్షేమానికి నిధులివ్వడానికి సర్కారు దగ్గర డబ్బులుండవు.. స్కాలర్‌షిప్‌లు విడుదల చేయడానికీ నిధులుండవు. ఏవైనా పథకాలు ప్రవేశపెట్టాలంటే నిధుల కోత వెంటాడుతుంది. కానీ.. సొంతఖర్చులకోసం కావల్సినంత సొమ్ము. కేంద్ర ప్రభుత్వం అనవసర ఖర్చులు చూస్తే.. ఎవరికైనా కళ్లు తిరగకమానవు. నిధులను ఫలహారం చేయడంలో మనవాళ్లను మించినోళ్లు ఎవరూ ఉండరేమో.. నమ్మరా.. స్నాక్స్‌, మినరల్‌ వాటర్‌కు ఎంత ఖర్చు చేశారో కేంద్ర ప్రభుత్వమే ఓ RTI కార్యకర్తకు అందజేసింది. ఆ వివరాలేంటో చూడండి.
కేంద్ర ఆరోగ్య శాఖ టిఫిన్, బాటిల్డ్ వాటర్ కోసం రెండేళ్లలో 94 లక్షల రూపాయలు ఖర్చుచేసిందట. ఈ శాఖ అధికారులు 2008-09లో 49.45లక్షల విలువైన స్నాక్స్‌ తినేశారు. ఇక 2009-10లో 44.62లక్షలు ఖర్చు చేశారు.
 
ఇక గ్రామీణాభివృద్ధి శాఖ ఇదే రెండేళ్లలో 41 లక్షల 42 వేల రూపాయలు కేవలం స్నాక్స్, వాటర్‌కోసం వాడుకుంది. జల వనరుల శాఖ, 20లక్షల 73 వేలు ఖర్చు చేయగా... పెట్రోలియం శాఖ పద్దు తక్కువగా 19 లక్షల 50వేలు.
 
మరి అన్ని అన్ని శాఖల మంత్రులకు బాస్‌ అయిన మన ప్రధాని ఎంత ఖర్చు చేశారో తెలుసా 11 లక్షల 77 వేలు. ఇది హెల్త్ మినిస్ట్రీ పద్దు కంటే ... 8 రెట్లు తక్కువ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి