12, ఆగస్టు 2011, శుక్రవారం
ఈనాడు కాస్త మారింది... మారాల్సింది ఇంకా ఉంది
ఈనాడు రూపు మార్చుకొంది. అయితే, ఈ వార్త పేపర్ కు సంబంధించింది కాదు. ఈనాడు ఆన్ లైన్ ఎడిషన్ కు సంబంధించింది. ఈనాడు.నెట్ ను ప్రారంభించినప్పటినుంచి ఒకేలా కనిపించిన వెబ్ సైట్ ఇవాళ నుంచి కొత్త రూపు సంతరించుకొంది. సమగ్రమైన పోర్టల్ లా డిజైన్ ను మార్చుకొంది. కొత్త డిజైన్ చూడడానికి ఆకర్షణీయంగానే ఉంది. లింకులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కొత్తగా వీడియో గ్యాలరీ, వాతావరణం చేరాయి. అయితే.. రూపు మార్చుకున్నా స్వభావాన్ని మాత్రం ఈనాడు.నెట్ మార్చుకోలేదు. ఇప్పటికీ తన ట్రేడ్ మార్క్ ఫాంట్ నే కొత్త సైట్ లోనూ వాడుతోంది. ప్రపంచమంతా యూనికోడ్ వైపు పరుగులు తీస్తుంటే ఇప్పటికీ ఈనాడు తన సొంతఫాంట్ నే కొనసాగించడం కాస్త విచారించదగిందే. అంతేకాదు..జిల్లాలను రెండు చోట్ల లింకులిచ్చారు.. అదీ ఎందుకో అర్థం కాదు. దాని బదులు ఒక చోట సెర్చ్ పెట్టి, ఫాంట్ ను యునికోడ్ లోకి మార్చితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సత్యంగారూ, ఒపెరా బ్రౌజర్ లో మీ సైట్ చూస్తున్నపడు ఏదైనా ఆర్టికల్ మీద క్లిక్ చేసినపుడు దాని శీర్షిక సరిగా కనిపించడంలేదు. మీ సైట్ లో సమస్యా లేక ఒపెరా బ్రౌజర్ సమస్యా అనేది అర్ధం కావడంలేదు. తెలుపగలరు.
Shravandsb@gmail.com