Pages

30, నవంబర్ 2010, మంగళవారం

మిరపబాంబు


మిరపకాయతో ఏం చేయొచ్చు...? ఇదీ ఓ ప్రశ్నేనా అనుకుంటున్నారా...? అయినా.. చెప్పాలంటే.. వంటల్లో వాడొచ్చు... బజ్జీలు చేయొచ్చు... కానీ అదే మిరపకాయతో... శతృవుల గుండెలు దడదడలాడించొచ్చు.... ఉగ్రవాదులను తరిమి తరిమి కొట్టొచ్చు... దేశాన్ని కాపాడొచ్చు... అంతటి అరివీర భయంకరమైన మిరపకాయ ఎక్కడుందో తెలుసా...?


మిరపకాయ ఘాటు... అంటే మనకు గుర్తుకువచ్చేది..గుంటూరు మిర్చి... ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే చాలు... .కళ్ల నంచి నీళ్లు ధారలు కడతాయి. మనకు తెలిసింది ఇంతే...కాని ప్రపంచంలోనే అతి ఘాటైన మిరపకాయ ఒకటి ఉందని మీకు తెలుసా..? అదేదో ఖండాంతరాలలో ఉందనుకోకండి. ఆ భయంకరమైన మిరపకాయ పెరిగేది మనదేశంలోనే. ఉప్పుడదే మిరపకాయ... మన సైన్యానికి ఆయుధంగా మారబోతోంది.
మిరపకాయ... సైన్యం... జోక్‌ కాదు.. నిఖార్సైన నిజం... అదే భుట్‌ జొలాకియా... ది గ్రేట్‌ అస్సాం మిర్చి... భుట్‌ జొలాకియా పవరేంటో మీకు తెలుసా....? అత్యంత ఘాటైన మిరపకాయ ఇది.
ఇంతకీ ఏ మిరపకాయ ఘాటు ఎంతో ఎలా తెలుసుకోవాలి...? అదేనా మీ డౌట్‌... మిర్చీ ఘాటుకు కప్సీన్‌ అనే రసాయనమే కారణం... దీన్ని స్కొవిల్లీ యూనిట్స్‌లో కొలుస్తారు... ఒక సాధారణ మిర్చి 2500 స్కొవిల్లీ యూనిట్స్‌ ఉంటే... వరల్డ్స్‌ హాటెస్ట్‌ మిర్చి భుట్‌ జొలాకియా... ఎన్ని స్కొవిల్లీ యూనిట్సో తెలుసా... మనం తినే మిర్చికి 4వేల రెట్లు ఎక్కువ... అంటే పదిలక్షల స్కొవిల్లీ యూనిట్స్‌. అసోం, నాగాలండ్‌, మణిపూర్‌లో పండే ఈమిర్చి ప్రపంచలోనే హాటెస్ట్ మిర్చి.
  ప్రపంచంలో నోటిని భగ్గుమనిపించే మిర్చీ వెరైటీలు చాలానే ఉన్నాయి... టబస్కో సాస్ అనే రకం‌లో స్కొవిల్లీ హీట్‌ యూనిట్‌ రేంజ్‌ 2600 నుంచి 5వేలు ఉంటుంది.ఇక జలపెనోలో ఈరేంజ్‌ 9వేలకు ఉంటుంది. థాయ్‌ HOTలో SHU అరవై వేల ఉంటుంది.మెక్సికోలో పండే రెడ్‌ సావినాలో ఘాటు ఐదు లక్షల 80 వేల స్కొవీల్లే యూనిట్లు ఉంటుంది. కాని అస్సోంలో పండే భుట్‌ జొలోకియాలో ఏకంగా SHU పది లక్షల 41 వేల 427 ఉంటుంది. ఈఘాటుపైనే చాలాకాలంగా డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ DRDO పరిశోధనలు చేసింది. తీవ్రవాదులు,శత్రువులను ఎదుర్కోవడానికి కొత్త కొత్త టెక్నాలజీతో అత్యాధునిక ఆయుదాలను రూపొందించి సైన్యానికి ఇచ్చే DRDO..ఇప్పుడు మిర్చిలో దాగున్న ఘాటును గుర్తించింది.ఆఘాటును తీవ్రవాదులపై ప్రయోగించడానికి  సిద్దం చేసింది. భుట్‌ జొలోకియాను వాడి చిల్లీ గ్రెనేడ్‌ను రూపొందించింది.. త్వరలోనే... ఈ రాకాసి మిరప.. ఇండియన్‌ ఆర్మీ అమ్ములపొదిలో ... అద్భుతమైన ఆయుధంగా మారనుంది.

అమెరికా వెళితే.. మీ గుట్టు రట్టే..


అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? ఇక ఎయిర్‌పోర్టులో దిగగానే మీ గుట్టు రట్టయినట్టే.. బండారం బయటపడ్డట్టే.. అదేంటి విమానమెక్కితే గుట్టెలా రట్టవుతుంది. బండారమెలా బయటపడుతుందనేగా మీ డౌట్‌.. అమెరికన్ ఎయిర్‌పోర్టుల్లోని పరికరాలు మీ శరీరభాగాలను మొత్తం చూసేలా చేస్తున్నాయి..
విమానంలో  ప్రయాణం ఎంత మజాయో ... అంతకుముందు జరిగే సెక్యూరిటీ చక్‌లు అంతటి చికాకు. లోపలికి వెళ్లగానే స్కానర్లు స్వాగతం పలుకుతాయి. లగేజ్‌ను అణువణువూ పరిశీలిస్తారు. డ్రెస్‌లో ఏదైనా ఉందోనని తడిమితడిమి చూస్తారు. ఇదంతా ఏ దేశంలోనైనా జరిగేదే. కానీ పెద్దన్న అమెరికా స్కానర్లు మాత్రం స్పెషల్. అవి కేవలం బాడీపైన మాత్రమే కాదు... లోపలికి కూడా తొంగి చూడగలవు.
 
బాడీ లోపలికి ఏంటి అని కన్ఫూజ్ అవుతున్నారా? కేవలం డ్రెస్‌లో ఎక్కడో దాచుకుని వెళ్లే పదార్థాలను మాత్రమే కాదు... మీ హెల్త్ హిస్టరీ మొత్తాన్ని సింపుల్‌గా స్కాన్ చేసి పడేస్తాయి. ఏ మహిళైనా బ్రెస్ట్ ఇంప్లాంట్ చేయించుకున్నా స్కానర్లు ఆ విషయాన్ని పసిగడతాయి. శరీరం లోపలన్న ఇంప్లాట్స్ వివరాలను బయటపెడతాయి. మగాళ్లలో ఎవరైనా ప్రోస్థెటిక్ టిస్టికల్స్ ఉంటే ఆ గుట్టూ బయటపడుతుంది. అంతేనా మహిళలు వాడే వివిధ రకాల ఇంట్రాయుటెరిన్ డివైజ్‌లు, పురుషుల పినైల్ ఇంప్లాంట్స్‌ కూడా పసిగడతాయట ఈ మాయదారి స్కానర్లు.
 
ప్రయాణీకుల నగ్న సౌందర్యాన్ని స్కానర్లు వడబోస్తున్నాయని ఇప్పటికే గగ్గోలు మొదలైంది. దీనికి తోడు బాడీలోపలి గుట్టును కూడా రట్టు చేస్తుందని తెలియటంతో ప్యాసెంజర్లు మండిపడుతున్నారు. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. భద్రతారీత్యా బాడీ స్కానింగ్‌ తప్పదంటోంది అమెరికా సర్కార్‌.

జగన్‌కు తొలిదెబ్బ


కాంగ్రెస్ పార్టీని జగన్ చీల్చుతారంటూ వస్తున్న వార్తలు ఎంతవరకూ నిజమవుతాయో గానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే ఆయన కుటుంబాన్ని చీల్చేసింది. తన వెంటే ఉంటాడనుకున్న బాబాయ్‌ను అబ్బాయి నుంచి దూరం చేసింది. ప్రాణం పోయే వరకూ కాంగ్రెస్‌తోనే ఉంటానంటూ కడపలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ వివేకానంద చాటి చెప్పారంటే, ఆయనకు కాంగ్రెస్ నుంచి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు బాబాయ్‌కీ అబ్బాయికీ గొడవలో ఎన్నో మలుపులు.. మరెన్నో కోణాలు. అవేమిటో చదవండి..

తొలిరోజు కాంగ్రెస్ పార్టీకి జగన్ షాకిచ్చి పైచేయి సాధిస్తే... రెండో రోజు మాత్రం ఆ ఛాన్స్‌ను కాంగ్రెస్ హైకమాండ్ అందుకొంది. ఎంతో నేర్పుగా, జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందనే అస్త్రంగా ప్రయోగించింది. ఇడుపులపాయనుంచి జగన్ రాజకీయం మొదలుకాకుండానే, తొలి పావును కదిపి చెక్ పెట్టింది. కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చిన జగన్‌కు అండగా ఉండనని వివేకానందతో చెప్పించింది.
జగన్‌కు కాంగ్రెస్‌కు మధ్య విబేధాలు కొనసాగుతుండగానే, మంత్రి పదవికోసం లాబీయింగ్ చేశారు వైఎస్ వివేకానంద. ఢిల్లీకి కూడా వెళ్లిసంప్రదింపులు జరిపారు. హైకమాండ్‌తో ఢీకొట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న జగన్, దీన్నే ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. తమ కుటుంబాన్ని చీల్చే నీచరాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతుందంటూ లేఖ రాసి, పార్టీని వీడారు. అయితే.. జగన్ తీరుతో వివేకానంద మనసు మార్చుకోవచ్చంటూ ప్రచారం జరిగింది. బంధువులతో చర్చలు జరపడం, ఇడుపులపాయలో జగన్‌ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకోవడం, ఆ తర్వాత మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం... తీవ్ర ఉత్కంఠను కలిగించాయి.
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం వివేకానంద జగన్‌తో సమావేశమయ్యారు. అయితే, వీరిద్దరి సమావేశం రెండు నిమిషాలపాటు కూడా సాగలేదు. జగన్ దగ్గర నుంచి విసురుగా వివేకానంద వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడనని, తన తండ్రి,సోదరుల బాటలోనే ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. దీంతో, జగన్‌తో పాటే ఉండడని తేల్చిచెప్పారు. పైగా, కాంగ్రెస్‌పై అభాండాలు వేయడం సరికాదంటూ, సోనియాను కీర్తించారు. మంత్రి పదవిపై ఎప్పటినుంచో ఆశలు పెట్టుకున్న వివేకానంద, కాంగ్రెస్‌తో పాటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఈ విషయంలో తనను కాంగ్రెస్ ప్రలోభపెట్టలేదని, తానే మంత్రి పదవికోసం లాబీయింగ్ చేశానంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. వైఎస్ వివేకానంద తీరు జగన్ శిబిరంలో ఒక్కసారిగా ఆందోళనను నింపింది. సొంతకుటుంబంలోనే చిచ్చుపెట్టి జగన్‌ను ఒంటరిని చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించింది.

వివేకానంద పావు మాత్రమే..!

కాంగ్రెస్ అసలు సిసలు రాజకీయాలు జగన్‌కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. రాజకీయాలను క్షణాల్లో మార్చేయగలగడంలో కాంగ్రెస్ అనుభవమేమిటో ఇప్పుడిప్పుడే ఆయనకు అర్థమవుతోంది. పార్టీ నుంచి బయటకువస్తే మరెంతో మంది తనవెంట నడుస్తారన్న జగన్ అంచనాలను వమ్ము చేయడం కోసం కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దిగువ శ్రేణి నేతలు జగన్‌వైపు నడవకుండా చూడడం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇప్పటికే రంగంలోకి దిగారు. నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. పార్టీ తరపున డీఎస్ కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారు.
ఇడుపులపాయలో వైఎస్ సమాధిని నివాళులు అర్పించడంతో కాంగ్రెసేతర రాజకీయాలకు శ్రీకారం చుట్టిన జగన్‌కు ఆదిలోనే అడ్డంకులను సృష్టించడంలో కాంగ్రెస్ హైకమాండ్ సక్సెస్ అయ్యింది. బాబాయ్‌ను అబ్బాయ్‌ను వేరు చేయగలగింది. వైఎస్ మాట జవదాటకుండా ఇంతకాలం రాజకీయ జీవితాన్ని కొనసాగించిన వివేకానంద, తనకు ఎదురు తిరగవచ్చని జగన్ ఊహించలేదు. అధిష్టానంతో సఖ్యత కోసం చిన్నపాటి ప్రయత్నాలు చేసినా, తనతో పాటే ఉంటారని భావించారు. కానీ, మంత్రి పదవికోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వివేకానంద, జగన్ కన్నా సోనియానే ఎక్కువనుకున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీపై విధేయతను చాటుకొన్నారు. జగన్‌తో నడవనంటూ స్పష్టం చేసేశారు. దీంతో, జగన్ ప్రయత్నాలకు అతని కుటుంబంలోనే మద్దతు లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాటిచెప్పగలిగింది. కుటుంబాన్నే గెలవలేని జగన్.. ఇక కాంగ్రెస్ శ్రేణులను ఎలా ఆకర్షించగలరన్న సందేశాన్ని పంపించినట్లయ్యింది. ఈ విషయంలో జగన్‌పై కాంగ్రెస్ పైచేయి సాధించింది.
జగన్‌ కాంగ్రెస్‌నుంచి బయటపడడంతో మరెంతోమంది ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి నేతలు రాజీనామాలు చేసే అవకాశం ఉందని ముందునుంచీ ప్రచారం జరుగుతోంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు జగన్‌కు ఉన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర సమాచారం ఉంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో వీరందరినీ కాపాడుకోవడం పార్టీకి కీలకం. జిల్లాల్లో కొంతమంది నేతలు రాజీనామాలు చేసినా దాని ప్రభావం పెద్దగా ఉండదు. ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగితే, పార్టీని నిలబెట్టుకోవడం కష్టమేమీ కాదు. అందుకే, వివేకానందను జగన్‌కు దూరం చేసింది. జగన్‌ను దగ్గర నుంచి చూస్తున్న వివేకానందే దూరంగా ఉంటున్నప్పుడు, ఆ సాకు చూపి మిగిలిన ఎమ్మెల్యేలను ఆపవచ్చన్న ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్‌ది.
జగన్ కుటుంబంలో రాజకీయంగా ప్రస్తుతం కీలకంగా ఉన్నది వివేకానంద మాత్రమే. ఆయన్ను దూరం చేసి జగన్‌ను ఒంటరిని చేసిన, కాంగ్రెస్.. మిగిలిన నేతలనూ జగన్‌వైపు వెళ్లకుండా ఆపగలమన్న విశ్వాసంతోనే ఉంది.

విలువ దక్కలేదనే..!
వైఎస్ రాజశేఖరరెడ్డిలా మాస్ ఇమేజ్ ఉండకపోవచ్చు. అంత దూకుడు లేకపోవచ్చు. కానీ, కడప రాజకీయాల్లో మాత్రం చాలా కాలంగా విజయయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ వివేకానంద రెడ్డి. పులివెందుల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా, కడప లోక్‌సభ స్థానం నుంచి మరో రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిలో కొనసాగుతున్నారు. వివేకానంద ఇంత సుదీర్ఘరాజకీయ ప్రస్థానం కొనసాగించడం వెనుకున్నది దివంగత నేత వైఎస్సారే. ఆయన ప్రోద్భలం, అండదండలతోనే మాస్ ఇమేజ్ లేకపోయినా, ఎన్నికల్లో వివేకానంద విజయాలను సాధించగలిగారు.
అయితే, వైఎస్ కుటుంబం తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదన్న అభిప్రాయం వివేకానందలో ఎప్పటినుంచో ఉంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించినప్పుడు, పులివెందుల లోక్‌సభనుంచి వైఎస్, కడప లోక్‌సభ నుంచి వివేకానందలు గెలుపొందారు. అయితే, జగన్‌ను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం వివేకానందను రాజీనామా చేయమని కోరినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఒకానొకదశలో వివేకానంద రాజీనామాకు సిద్ధపడ్డారు. అధిష్టానం వారించడంతో వెనక్కితగ్గారు. అయితే, 2009 ఎన్నికల్లో మాత్రం వివేకానందకు వైఎస్ మొండిచేయి చూపించారు. లోక్‌సభ టికెట్‌ను తన కొడుకు జగన్‌కు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి వివేకానందను శాంతిపజేశారు. కానీ, ఈ పరిణామాలతో వివేకానంద తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వైఎస్ కుటుంబ అవసరాల కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడాన్ని తట్టుకోలేకపోయారు. అందుకే, వైఎస్ మృతి చెందినప్పటినుంచీ వివేకానందలో మార్పు మొదలయ్యింది. తొలి నుంచీ జగన్‌కు దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓ వైపు కాంగ్రెస్ హైకమాండ్‌ను ధిక్కరించి జగన్ ఓదార్పు యాత్ర మొదలుపెట్టడంతో, తన విధేయతను చాటుకునే అవకాశం తొలిసారి వివేకానందకు వచ్చింది. అంతే, కాంగ్రెస్ అధిష్టానాన్ని కీర్తిస్తూ.. జులై 17 వ తేదీన సోనియాకు ఓ లేఖ రాశారు. అయితే, దీన్ని ఆయన బయటపెట్టలేదు. కానీ, రెండు నెలల క్రితం బయటపడ్డప్పుడు మాత్రం ఈ లేఖ పెద్ద సంచలనాన్నే సృష్టించింది.
వైఎస్ హయాంలో వివేకానంద పూర్తిగా తెరవెనుకకే పరిమితమయ్యారు. ఎలాంటి పదవులనూ ఆయన అనుభవించలేదు. వైఎస్ ఆధిపత్యంతో పూర్తిగా విసిగిపోయారు. అందుకే, ఇప్పటికైనా తన మానాన తాను రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నారు. జగన్ అసమ్మతి కారణంగా వివేకానందకు మంత్రిపదవి అందే అవకాశమూ ఇప్పుడు వచ్చింది. చేతికందిన ఈ అవకాశాన్ని కాలితో తన్నాలని వివేక భావించడం లేదు. పైగా, జగన్‌వైపు వెళితే, ఇప్పటికిప్పుడు వచ్చేది కూడా ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారన్న నమ్మకమూ లేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవి ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో మూడున్నరేళ్ల అధికారం ఉండడం చూస్తుంటే, జగన్ వైపు కన్నా.. కాంగ్రెస్ వైపు ఉంటేనే లాభమనుకుంటున్నారు. అందుకే జగన్‌కు టాటా చెప్పి, కాంగ్రెస్‌లో కంటిన్యూ అవుతున్నారు.

జగన్‌పై విమర్శల వర్షం..

జగన్ తీరుతో కాంగ్రెస్ నేతలకు కొత్త కష్టం వచ్చిపడింది. పార్టీనుంచి జగన్ బయటపడడంతో పార్టీలో ఉండాలో లేదో తెల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, నిన్నామొన్నటి దాకా జగన్ చుట్టూ తిరిగినవారిలో ఎక్కువమంది కాంగ్రెస్‌లోనే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే, జగన్‌ను విమర్శించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జగన్‌ను విమర్శించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి దగ్గరవ్వాలన్న ఆలోచనే చాలామంది నేతలది. పైగా, సోనియా ఫ్లెక్సీలను చింపడం, శవయాత్రలను నిర్వహించడంపైనా కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
జగన్ కూడా బయటకువెళ్లిపోవడంతో, వైఎస్ వ్యతిరేకులుగా ముద్రపడ్డ చాలామంది హవా మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలు ప్రభుత్వంపైనా, పార్టీపైనా పట్టు సాధించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నాచితకా లీడర్లు జగన్‌వైపు వెళ్లినా, కీలకమైన నేతలు ఎవరూ వెళ్లరన్నది సీనియర్ల విశ్వాసం.
కాంగ్రెస్ నేతల నుంచి విమర్శల తాకిడి క్రమంగా ఎక్కువవుతోంది. ముఖ్యంగా సోనియాగాంధీని లక్ష్యంగా చేసుకుంటూ జగన్ లేఖను సంధించడాన్నే కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో ఊరుకుంటే జగన్ మరింత రెచ్చిపోతారని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నేతలందరి లక్ష్యం ఒకటే... అదే జగన్‌ను కట్టడి చేయడం. పైగా, జగన్‌పై విమర్శలు పెరిగితే, కాంగ్రెస్ నుంచి వెళ్లాలనుకునే వారూ ఆగిపోవచ్చన్న అభిప్రాయం వారిది. అందుకే, విమర్శల విషయంలో ఏమాత్రం మొహమాటపడడం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ నీచ రాజకీయాలకు పాల్పడలేదని, స్వయంగా వివేకానందరెడ్డే ప్రకటించడం కాంగ్రెస్ నేతలకు కొత్త ఉత్సాహాన్ని అందించింది. జగన్‌పై మరింత దూకుడుగా మాటలదాడి చేయడానికి పురికొల్పింది.

జగన్ ఎదురుదాడి?


కాంగ్రెస్ నేతల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు జగన్. దీనికోసం వీలైనంత త్వరగా తన బలాన్ని ప్రదర్శించాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇడుపులపాయకు వైఎస్ అభిమానులు, జగన్ అనుచరులు వెల్లువలా వస్తున్నారు. కీలక నేతలతో ఎప్పటికప్పుడు జగన్ చర్చలు జరుపుతూ భవిష్యత్ కార్యాచరణకు రూపం ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎలాగూ బయటకు వచ్చాం కాబట్టి త్వరలోనే పార్టీ పెట్టి ముందుకు వెళ్లాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
సోనియానే టార్గెట్ చేసుకుని జగన్ వర్గం ముందుకు కదులుతోంది. విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. దేశంలోకి మళ్లీ బ్రిటీష్ పాలనను తెస్తోందంటూ విరుచుకుపడుతోంది. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టడం, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్‌ను దెబ్బకొట్టడం ఈ రెండే లక్ష్యంగా జగన్ శిబిరం పావులు కదుపుతోంది.

తెలంగాణకు జగన్ అనుకూలమా?
కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇరుకున పెట్టేలానే జగన్ వర్గం పావులు కదుపుతోంది. జగన్ రాసిన లేఖకు సోనియా సమాధానం ఇవ్వాలని, వైఎస్ మృతిపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని ప్రకటనలు చేస్తోంది. దీనికితోడు డిసెంబర్ 31లోగా తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనంటూ జగన్ వీరవిధేయురాలుగా ముద్రపడ్డ కొండాసురేఖ ప్రకటించడం కలకలం పుట్టిస్తోంది. కేవలం కాంగ్రెస్ హైకమాండ్‌ను ఇరుకున పెట్టడానికే ఈ ఎత్తుగడ వేశారా లేక.. తెలంగాణకు సానుకూలంగా వ్యవహరించి, పట్టుపెంచుకోవాలని జగన్ భావిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది.

29, నవంబర్ 2010, సోమవారం

జగన్ వ్యూహం ఏమిటి?


వేటా.. లేటా.. సందేహాలకు సమాధానం దొరికింది. కాంగ్రెస్, జగన్ మధ్య చాలాకాలంగా సాగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ముందడగు పడింది. కాంగ్రెస్ అధిష్టానం వైపు నుంచే చర్యలుంటాయన్న అనుమానాలను పక్కన పెడుతూ, జగనే నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ నిష్క్రమణ
ఎంపీ పదవికి జగన్ రాజీనామా
ఎమ్మెల్యే పదవికి జగన్ తల్లి విజయలక్ష్మి రాజీనామా
పార్టీ సభ్యత్వానికి రాజీనామా
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కూర్పులో నేర్పుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడు జగన్ మోహన్‌రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. ముసుగులో గుద్దులాటలా సాగుతున్న వ్యవహారంలో ముందడుగు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. అందులో భాగమే రాజీనామా అస్త్రం.
ష్ట్ర రాజకీయాలను నిశింతంగా పరిశీలిస్తున్నవారికి జగన్ రాజీనామా పెద్ద వింతకాకపోవచ్చు. కానీ, రాష్ట్ర మంత్రివర్గ కసరత్తు సమయంలో ఉన్నప్పుడే జగన్ రాజీనామా చేయడం మాత్రం విస్తుగొలిపేదే. జగన్‌ను ఎదుర్కోవడం కోసమే కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి సోనియాగాంధీ ఎంపిక చేశారన్న వార్తలు ఇప్పటికే కాంగ్రెస్‌లకు కలకలం పుట్టిస్తున్నాయి. వైఎస్ అనుచరులుగా జగన్‌కు మద్దతు ప్రకటిస్తున్న వారికి కిరణ్‌కుమార్ నియామకం పిడుగుపాటులాగే అనిపించింది. అయినా ఓర్పుతో ఉంటామని సంకేతాలిచ్చిన జగన్ శిబిరం, ఒక్కసారిగా వ్యూహాన్ని మార్చింది. జగన్, విజయలక్ష్మిల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చింది.
గన్ రాజీనామాతోనే గొడవ పూర్తవ్వలేదు. అసలు గొడవ ఇప్పుడే మొదలుకాబోతోంది. వైఎస్ తనయుడిగా రాజకీయప్రవేశం చేసిన జగన్, కాంగ్రెస్‌ను వదిలిపెట్టినా రాజకీయాలను వదులుకునే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మరి, జగన్ కొత్త పార్టీని ప్రారంభిస్తారా..?ఒకవేళ ప్రారంభిస్తే పార్టీ పేరేమిటి? కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి జగన్ సమస్యలు సృష్టిస్తారా..? లేక జగన్ రాజీనామాకు కాంగ్రెస్ హైకమాండ్ దిగివస్తుందా..? రాజీ ప్రయత్నాలు చేస్తుందా..? జగన్ రాజీనామా సృష్టించబోయే పరిణామాలు ఎలా ఉంటాయి?

రాజుకున్న చిచ్చు
గన్ రాజీనామా రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. జగన్‌కు మద్దతుగా చాలామంది రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. మరోవైపు జగన్ రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ ఆమోదం తెలిపారు. రాష్ట్ర ఎంపీలు ఉండవల్లి, సబ్బం హరి, మేకపాటిలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. బుధవారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. జగన్ నిర్ణయానికి అనుగుణంగా ముందడుగు వేయాలని మరికొంతమంది ఎమ్మేల్యేలు భావిస్తున్నారు.
ష్ట్రవ్యాప్తంగానూ జగన్ రాజీనామా కలకలం పుట్టించింది. జగన్‌కు మద్దతుగా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి. జగన్ నివాసం వద్దే సోనియా శవయాత్రను నిర్వహించి, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతపురం, కడప, తిరుపతి, గుడివాడల్లోని కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. కడప,ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు డీసీసీ అధ్యక్షులు రాజీనామా చేశారు. చాలామంది ఎంపీపీలు, ఎంపీటీసీలు జగన్‌కు మద్దతుగా పదవులు వదులుకుంటున్నట్లు ప్రకటించారు.
గన్ రాజీనామాపై పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజీనామా వల్ల అటు పార్టీకి ఇటు జగన్‌కు నష్టం ఉంటుందని వ్యాఖ్యానించారు. జగన్ రాజీనామా అనంతరం జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు తెలుసుకొంటోంది. గన్ రాజీనామాపై కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా స్పందించలేదు. దురదృష్టకరమని మాత్రమే పేర్కొంది. జగన్ రాజీనామాను కొత్త సీఎం కిరణ్‌కుమార్ తేలిగ్గా తీసుకున్నారు. క్యాబినెట్ ఏర్పాటుపై ఈ పరిణామాలు ఏమాత్రం ప్రభావం చూపించవని ప్రకటించారు. గ్రెస్ కార్యాలయాలపై దాడులు, సోనియాపై విమర్శలు కాంగ్రెస్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. జగన్ వర్గం ఈవిషయంలో వెనక్కితగ్గితే మంచిందంటూ సూచిస్తున్నారు.


సోనియమ్మే లక్ష్యం ..

కాంగ్రెస్ ఇంటిపోరు వీధిన పడింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్‌పై ఇంతకాలం పోరాటం సాగించిన జగన్, ఎట్టకేలకు వేరుపడ్డారు. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలికి ఐదు పేజీల లేఖను రాశారు. అందరికీ తెలియడం కోసం ఆ లేఖనే మీడియాకు విడుదల చేశారు. ప్రతీ పదాన్ని ఆచూతూచి వాడిన జగన్.. కాంగ్రెస్ అధిష్టానం తీరును అడుగడుగునా విమర్శించారు. తన రాజీనామాకు కారణం కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణమని తేల్చి చెప్పారు. పార్టీనే తనను బయటకు పంపించిందన్న సంకేతాలను తన అనుచరులకు, రాష్ట్ర ప్రజలకు పంపించారు.
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖ రాస్తున్నానంటూ మొదలుపెట్టిన జగన్.. వైఎస్ మరణానంతరం జరిగిన సంఘటనలను, తనను కట్టడి చేయడానికి గుట్టుగా సాగుతున్న ప్రయత్నాలను ఏకరవు పెట్టారు. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డికి ఆశలు చూపి, తమ కుటుంబాన్నే చీల్చే నీచ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇదంతా తనను పార్టీనుంచి బయటకు పంపడానికి, వైఎస్ కీర్తి ప్రతిష్టలను తుడిచివేయడానికి జరుగుతోందనే అభిప్రాయపడ్డారు. నా మీద ఎందుకు ఇలా కత్తిగట్టారు? అని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ మరణించిన అనంతరం 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా, అధిష్టానం సూచన మేరకే రోశయ్య పేరును ప్రతిపాదించానని తన విధేయతను చాటుకున్నారు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నా, వాటికి ఢిల్లీ పెద్దలు సహకరించారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ విగ్రహాలను ఊరూరా పెట్టడం వల్ల నష్టమేమిటంటూ నిలదీశారు.
తన లేఖలో సోనియా తీరునూ టార్గెట్ చేసుకున్నారు జగన్. చిరంజీవికి, తన చిన్నాన్న వివేకానందకు ఒక్కరోజులోనే దొరికే సోనియా అపాయింట్‌మెంట్, తనకు,తన తల్లికి మాత్రం నెలరోజులకు గానీ ఎందుకు దక్కలేదంటూ ప్రశ్నించారు. ఓదార్పుయాత్రలో పాల్గొనకుండా ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆంక్షలు విధించడాన్నీ తప్పుబట్టారు.
తన తండ్రి మరణంపై దర్యాప్తునూ జగన్ లేఖలో ప్రస్తావించారు. కంటితుడుపుగా జరిగిన ఈ దర్యాప్తు ఎన్నో ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేదని, హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా ఎన్నో అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. 125 వసంతాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్‌పై విశ్లేషణాత్మక కథనాలను ప్రసారం చేసిన తన ఛానల్‌పై దాడి చేయడాన్ని, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడాన్ని ఆక్షేపించారు. ఇలా ఎన్నో రకాలుగా తనకు ఇబ్బందులను కలిగిస్తుంటే, ఇంకెంత కాలం సహనంతో ఉండాలంటూ సూటిగా ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్డు మీద వెళ్లే చిన్నపిల్లాడిని అడిగినా "నేడో రేపో జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తారు" అని చెప్పే స్థాయికి వెళ్లాయంటూ తన లేఖలో ఆగ్రహం వెళ్లగక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండలేనని స్పష్టం చేసేశారు. అంతేకాదు.. "తనను ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు. ఒంటరిగా నేనే వెళుతున్నాను".. అని సోనియాకు రాసిన లేఖలో ప్రత్యేకంగా జగన్ ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానంటూ తనపై దుష్పచారం జరుగుతోందని, తనది అలాంటి వ్యక్తిత్వం కాదనీ పేర్కొన్నారు. తనకోసం ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయవద్దనీ కోరారు. ఇలా అధిష్టానానిదే తప్పంతా అని చాటిచెప్పే ప్రయత్నాన్ని ఈ లేఖ ద్వారా చేశారు జగన్‌మోహన్ రెడ్డి.

అసెంబ్లీకి జగన్..

కొత్త సీఎం పూర్తిగా పదవిని చేపట్టనే లేదు. మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోనేలేదు. తనదైన పాలనను మొదలుపెట్టనే లేదు. అప్పుడే సమస్యలు. జగన్ రూపంలో అసమ్మతి మొదలయ్యింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే తన ప్రణాళిక అమలు కాదని నిర్ధారించుకున్నందునే, జగన్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తల్లితో కూడా రాజీనామా చేయించడం ద్వారా సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. విజయమ్మ రాజీనామాను ఆమోదం పొందితే పులివెందుల సీటు ఖాళీ అవుతుంది. ఎంపీ స్థానానికి బదులు ఎమ్మెల్యేగానే జగన్ పోటీ చేయవచ్చు. పార్టీలో తనను అణిచివేయడానికే కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎంగా నియమించారని భావిస్తున్న జగన్.. పులివెందుల నుంచి అసెంబ్లీకి వచ్చి, నేరుగా ఆయన్నే ఢీకొట్టాలని భావిస్తున్నారు.
తనకోసం ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయవద్దని జగన్ కోరుతున్నా, ఆయన అనుచరులు మాత్రం రాజీనామాలకే సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది జగన్ వైపు ఉన్నారన్నది కచ్చితంగా తేలకపోయినా 20 మందికి పైగానే జగన్ వెంట ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తాము జగన్ వెంటే ఉంటామంటూ స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నారు. ఓ వైపు మంత్రివర్గ విస్తరణ ఉండడం, పదవులు దక్కవచ్చన్న ఆశలు చాలామందిని ఇరకాటంలో పెడుతున్నాయి. తొందరపడి రాజీనామా ప్రకటనలు చేస్తే మొదటికే మోసం రావచ్చన్న అనుమానాలు ఎమ్మెల్యేలను పీడిస్తున్నాయి. అందుకే, బుధవారం వరకూ ఎమ్మెల్యేల వైఖరి స్పష్టం కాకపోవచ్చు. మంత్రి పదవులు దక్కకపోతే మాత్రం చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జగన్‌వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను ఎదిరించి తన బలాన్ని చాటుకోవాలంటే జగన్‌కు ఇంతకన్నా మంచి అవకాశం రాకపోవచ్చు. అందుకే, పదవుల అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చేపనిలో పడ్డారు. సోనియాకు రాసిన లేఖలో కాదన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో చీలిక తేవాలన్నదే జగన్ ఉద్దేశం.
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే జగన్ రాజీనామా లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్త పార్టీ పెడతారంటూ కొంతమంది చెబుతున్నా, జగన్ మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ ప్రకటన చేయలేదు. అయితే.. ఇడుపులపాయలో తండ్రి సమాధిని సందర్శించిన అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముందుగా, మరో విడుత ఓదార్పుయాత్రను చేపట్టి, ఆ తర్వాతే రాజకీయ నిర్ణయాన్నితీసుకోవచ్చు. జగన్ దూకుడు చూస్తుంటే.. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసినట్లే. కాంగ్రెస్‌ను ఎదిరించి, ఆ పార్టీకి పూర్తి ప్రత్యామ్నయంగా ఎదగాలని భావిస్తున్నారు. అందుకే, వీలైనంత తొందరలోనే కొత్తపార్టీని అనౌన్స్ చేసే అవకాశాలూ ఉన్నాయి.

ప్రభుత్వం పడగొడతారా...?

2009 సాధారణ ఎన్నికల్లో వైఎస్ నేతృత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 156 స్థానాలను గెలుచుకుంది. రెండోస్థానంలో నిలిచిన తెలుగుదేశం పార్టీ 92 స్థానాలను గెలుచుకుంది. పీఆర్పీ 18, టీఆర్‌ఎస్ 10, ఎంఐఎం 7, సీపీఐ 4, బీజేపీ 2, సీపీఎం1, లోక్‌సత్తా ఒకస్థానంలోనూ గెలుపొందాయి. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు ఎన్నికల్లో గెలుపొందారు. ఎన్నికల అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్, బాలనాగిరెడ్డిలు నిత్యం అసమ్మతి స్వరం వినిపిస్తూ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. దీంతో టీడీపీ బలం 90కి చేరింది. ఉపఎన్నికల్లో మరో స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కోల్పోవడంతో టీడీపీకి 89 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీమార్కు 148కు మించి ఎనిమిది స్థానాలు అధికంగానే ఉన్నాయి. ఒకవేళ జగన్ వెనుక మరో పదిమంది ఎమ్మెల్యేలు వెళితే ప్రభుత్వానికి కష్టకాలం మొదలవుతుంది. ఇప్పటికే విజయమ్మ రాజీనామా చేసింది కాబట్టి, ఈ ఆధిక్యంలో ఒకటి తగ్గినట్లే. అయితే.. ఇలాంటి పరిస్థితి ఎప్పటికైనా రావచ్చని ఊహించిన కాంగ్రెస్ అధిష్టానం ముందునుంచీ రక్షణాత్మక చర్యలను చేపట్టింది. అందులో భాగంగానే ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ఆకర్షించింది. జగన్ రాజీనామా చేయకముందే మంత్రిపదవుల ఆశ కూడా చూపింది. అంటే, జగన్ తిరగబడడం ఖాయమేనని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నమాట. పీఆర్పీకి 18 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి, కాంగ్రెస్‌తో కలిస్తే 173 మంది బలం ఉంటుంది. దీంతో ప్రభుత్వం పడిపోదన్న అంచనా కాంగ్రెస్‌ది.
ఎంఐఎంకున్న 7గురు ఎమ్మెల్యేల మద్దతు కూడా కాంగ్రెస్‌కు ఉంటుంది కాబట్టి బలం 180 ఉన్నట్లే, ఇక ఇండిపెండెంట్లు ముగ్గురూ మద్దతిస్తే బలం 183కు పెరుగుతుంది. ఒకవేళ టీఆర్‌ఎస్ కూడా ఆదుకోవడానికి ముందుకు వస్తే ఈ బలం 194కు పెరుగుతుంది. లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రభుత్వ పక్షం నిలబడితే 195 మంది బలం అధికారపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోవాలంటే, ఎంతలేదన్నా 48 మందిని జగన్ చీల్చగలగాలి. అప్పుడే ప్రభుత్వం పడిపోయే అవకాశాలుంటాయి. ఇప్పటికే 20 మందికి పైగా జగన్ పక్షాన ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ రెబల్స్ ఇద్దరూ జగన్ పక్షమే. పీఆర్పీ నుంచి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌వైపు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 48 మందిని జగన్ సమీకరించగలుగుతారా అన్నదే ఇప్పుడు సమస్య. ఇంతపెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతు పలకకపోవచ్చన్న ఆశ కాంగ్రెస్‌ది. అందుకే, హైకమాండ్ ధైర్యంగా ముందడుగు వేస్తోంది.


టార్గెట్ 2014

ఇదే సమయంలో జగన్ ఆలోచిస్తోంది మాత్రం పూర్తిగా వేరు. ఇప్పటికిప్పుడు సీఎం పదవి అందే అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి, దానికోసం ప్రయత్నాలు చేయకూడదనే అనుకుంటున్నారు. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందిపెట్టిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయాలనే ప్రణాళికలు రచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా, కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవన్నది జగన్ అంచనా. పైగా, పార్టీ తరపున ప్రచారం చేయడానికి జనాకర్షనేతలెవరూ లేరు. ఇక సోనియా, రాహుల్ ప్రభ బీహార్ ఎన్నికల్లోనే తేలిపోయింది కాబట్టి, రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న అంచనా జగన్‌ది. అందుకే, కాంగ్రెస్‌ను పతనం చేసి, ఆ స్థానంలో తాను ఎదగాలనుకుంటున్నారు. వీలైతే 2014, లేదంటే 2019 ఈ రెండు సంవత్సరాలే ఇప్పుడు జగన్ టార్గెట్. అప్పటిలోగా ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవాలన్నది జగన్ వ్యూహం. అందుకు ఇప్పటినుంచే పావులు కదపడం మొదలుపెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేయడం ద్వారా, జగన్ ఆశలకు కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా గండి కొట్టింది కాబట్టి, ఒంటరిగా పోవడమే మేలని, రాజీనామా సంధించారు.

25, నవంబర్ 2010, గురువారం

ఇదో రకం దోపిడీ!


చందాలు వసూలు చేసే దందాను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మొదలుపెట్టారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అవసరమైనప్పుడల్లా తనకు అలవాటైన ఫార్ములాను ఉపయోగిస్తున్న కేసీఆర్, ఈ సారీ అదే పని చేశారు. కూలీ పనంటూ చిన్న చితకా పనులు కొన్ని నిమిషాల పాటు చేసి లక్షలు అందుకోవడం ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. వరంగల్ సభ నిర్వహణ పేరిట ఈసారీ అదే పనిలో పడ్డారు. హైదారాబాద్‌లోని ఉప్పల్‌తో మొదలై వరంగల్ వరకూ ఒక్కరోజులో ఆయన కూలీయాత్ర సాగింది. అన్నిచోట్లా భారీగానే డబ్బులు వసూలయ్యాయి గానీ, ఒక్క చోట మాత్రం మొండిచెయ్యి ఎదురయ్యింది. యాదగిరిగుట్టలో అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో నిరాశ వెనుదిరిగారు కేసీఆర్. అయినా, తీసుకునేది పార్టీ విరాళం అయినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలి గానీ, ముందుగానే ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎక్కడైనా ఉంటుందా...? యాదగిరిగుట్టలోని ఓ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఇలానే 5 లక్షలు కావాలని, కేసీఆర్ కూలీపని చేయగానే ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారట. తీరా ఆయన చేసిన పనేమిటయ్యా అంటే, గౌడౌన్‌లోని తీగచుట్ట తెచ్చి ట్రాలీలో వేయడం. దీనికి 5 లక్షలు ఇచ్చుకోవాలా..? ఇదేమైనా న్యాయమా..! మనస్పూర్తిగా ఇచ్చింది తీసుకోవాలి గానీ, ఈ వసూళ్ల దందా ఏంది కేసీఆర్? దీనికి సంబంధించి ఈనాడు పత్రికలో వచ్చిన ఆర్టికల్ కింద ఉంది చదవండి.

కేసీఆర్‌ కూలీ వనికి దక్కని రూ.5 లక్షలు!
అసంతృవ్తితో పెనుదిరిగిన తెరాస అధినేత
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే : కూలి వనిచేసి వచ్చిన డబ్బును బహిరంగ సభకు కేటాయిరచాలనుకున్న కేసీఆర్‌కు నిరాశే ఎదురైరది. బుధవారం కూలీ పనిచేసి కూడా వేతనం గిట్టుబాటు కాలేదంటూ అసంతృప్తితో వెనుదిరిగారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీలో పనికి వచ్చిన కేసీఆర్ తొలుత జనరల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లారు. తర్వాత తెరాస రాష్ట్ర నాయకుడు కళ్లెం యాదగిరిరెడ్డి, పొలిట్‌బ్యూటరో సభ్యురాలు గొంగడి సునీతతో ఫ్యాక్టరీ గోదాంలోని తీగచుట్టను కేసీఆర్ స్వయంగా మోసుకొచ్చి ఆటోట్రాలీలో పేర్చారు. కూలిడబ్బు అడిగితే ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోగా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కేసీఆర్ అసంతృప్తితో వెనుదిరిగారు. ఆయన కూలీపనికోసం వస్తున్నారన్న విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యానికి నాలుగు రోజుల ముందే తెలిపామని తెరాస పొలిట్ బ్యూరో సభ్యురాలు గొంగడి సునీత చెప్పారు. కేసీఆర్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని కోరామని, ఫ్యాక్టరీయాజమాన్యం మాత్రం ఏమీ చెప్పకుండా తాత్సారం చేసిందని చెప్పారు. తెరాస నేత కూలిగా రూ.5 లక్షలు చెల్లించాలని కోరిన విషయాన్ని ఫ్యాక్టరీ యాజమాన్య దృష్టికి తీసుకువెళ్లామని ఆ సంస్థ జనరల్ మేనేజర్ మణివణ్ణన్ తెలిపారు. యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ నేతలు కోరిన మేరకు అందించలేకపోయామన్నారు. రూ.25వేలు మాత్రం ఇచ్చేందుకు సిద్ధం కాగా, పార్టీ శ్రేణులు తిరస్కరించాయన్నారు.

21, నవంబర్ 2010, ఆదివారం

మళ్లీ మునగ చెట్టు ఎక్కితే ఒట్టు..!


ఎవరైనా మనల్ని ఏమాత్రం పొగుడుతున్నా, మునగచెట్టు ఎక్కిస్తున్నాడురా అని అనుకోవడం సహజమే. అసలు పొగడ్తలకీ, మునగచెట్టు ఎక్కించడానికి మధ్య సంబంధం ఏమిటో తెలియక చిన్నతనంలో చాలాకాలం సతమతపడ్డా. కానీ, మునగచెట్టు ఎక్కితే ఏమవుతుందో కొద్దికాలానికే నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. అదేమిటో తెలియాలంటే ఈ స్టోరీని మీరు చదవాల్సిందే.

పూర్తి స్టోరీని అక్షరలో చదవండి.

19, నవంబర్ 2010, శుక్రవారం

ఉక్కుమనుషులు... వస్తున్నారు


ఎదుటి మనిషిని ఓడించాలంటే తెలివి మాత్రమే కాదు.. బలం కూడా ఉండాలి. అవతలి వ్యక్తి శక్తిని తట్టుకునే సామర్థ్యం ఉండాలి. వీరోచిత విన్యాసాలు చేయాలంటే.. అంతులేని శక్తి కావాలి. మరి అప్పటికప్పుడు ఆ శక్తిని సంపాదించుకోవడం ఎలా.. ? సాధ్యమేనంటున్నారు పరిశోధకులు. అదికూడా ఒకే ఒక్క సూట్‌తో..

శత్రువు ఎంత బలవంతుడైనా.. ఈ సూట్ వేసుకుంటే ఏమీ చేయలేడు.
ఈ సూట్‌తో ఎలాంటి ప్రమాదాల నుంచైనా బయటపడవచ్చు.
గాల్లో ఎగిరిపోవచ్చు... ఆకాశంలో విహరించవచ్చు.. ఎక్కడికైనా క్షణాల్లో వెళ్లిపోవచ్చు.
శరీరాన్నే ఆయుధంగా మార్చుకోవచ్చు. చేతులనే వెపన్స్‌గా వాడుకోవచ్చు.
ఒకే ఒక్కడు వందలాదిమందితో పోరాడవచ్చు..
ఎక్కడకావాలనుకుంటే అక్కడ సూట్‌ను వేసుకోవచ్చు.. వద్దనుకుంటే విప్పేయవచ్చు..
సాధారణ వ్యక్తిని కూడా మహా బలశాలిని చేస్తుందీ సూట్.
మనుషులే యంత్రాలుగా మారిపోవచ్చు..
ఏదో హాలీవుడ్ సినిమాగురించి చెబుతున్నట్లు అనిపించినా.. త్వరలోనే ఇవన్నీ నిజమవబోతున్నాయి. ఎవరైనా వేసుకునే వీలుండే ఐరెన్‌మ్యాన్ సూట్లు ఇప్పుడు తయారవుతున్నాయి. ఒక్కసూట్ వేసుకుంటే చాలు.. ఒక్కొక్కడు 20 మందికి సమానమైన బలాన్ని అందుకోవచ్చు. మనుషులంతా ఐరెన్‌మ్యాన్‌లుగా మారిపోవచ్చు.

అమెరెకాలో తయారీ..

ఐరెన్‌మెన్ సినిమా స్పూర్తి నిచ్చిందో ఏమో గానీ, అమెరికన్ పరిశోధనా సంస్థలన్నీ ఇప్పుడు ఐరెన్‌మ్యాన్‌లను తయారు చేసే పనిలో పడ్డాయి. అమెరికన్ సైనికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన సూట్స్‌ను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ సూట్లు.. త్వరలోనే అమెరికన్ సైనికులకు అందవచ్చు. సైబోర్గ్‌ల రూపంలో కనిపించేలా అమెరికన్ సైనికుల రూపాన్ని మార్చడంపైనే అందరూ దృష్టి పెట్టారు.
ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేలా యూఎస్ ఆర్మీని సిద్దం చేయడమే ఈ సూట్ ప్రధాన ఉద్దేశం. సోల్జర్ శరీరం ఏమాత్రం కనపడకుండా పూర్తిస్థాయిలో కవర్ అయ్యే సూట్లను కూడా కొంతమంది ఇప్పటికే తయారు చేశారు. ప్రాజెక్ట్ గ్రిజ్లీ రూపంలో తయారైన ఓ సూట్ అందరినీ ఆకట్టుకొంటోంది. వెపన్స్, బుల్లెట్స్ అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఈ సూట్‌ సిద్ధమయ్యింది. పైగా బరువు కూడా తక్కువే అంటున్న ఈ సూట్‌లో మరెన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
చూడడానికి స్టిఫ్‌గా ఉన్నప్పటికీ ఈ సూట్ వేసుకుంటే ఎంతో కన్వీనెంట్‌గా ఉండొచ్చు. ఈ సూట్‌తో పాటే ప్రత్యేకమైన హెల్మెట్‌ కూడా ఉంటుంది. రాత్రివేళల్లో పనిచేయడానికి వీలుగా ఈ హెల్మెట్‌లో ప్రత్యేకమైన లైట్స్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులకు ఇబ్బంది లేకుండా చేస్తుంది ఈ గ్రిజ్లీ సూట్.

ఎక్సో స్కెలెటిన్

అమెరికన్ సైనికులకు కొత్త శక్తిని అందించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఒకే ఒక్క సూట్‌తో తన సైనికులను మహాశక్తిసంపన్నులను చేయాలని అమెరికా భావిస్తోంది. అదే ఎక్సో స్కెలెటిన్ సూట్. ఈ సూట్ వేసుకుంటే అలసటన్నదే లేకుండా యుద్ధరంగంలో దూసుకుపోవచ్చు.
ఈ ఎక్సో స్కెలెటిన్ సూట్‌ను అమెరికా తయారు చేయించడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అష్టకష్టాలు పడుతోంది. వరల్డ్‌ట్రేడ్ సెంటర్స్‌ను అల్‌ఖైదా కూల్చేసిన తర్వాత అమెరికాకు.. టెర్రరిస్టు సంస్థలకు మధ్య ఎడతెరిపి లేకుండా యుద్ధం సాగుతోంది. తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఏమాత్రం అలవాటులేని ఎడారుల్లో అమెరికన్ సైనికులు రోజుల తరబడి ఉండాల్సి వస్తోంది. పైగా ఎటువైపునుంచి ఏ సమయంలో టెర్రరిస్టులు దాడి చేస్తారో తెలియదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయడం కష్టమే. వీరి కష్టాలను తీర్చడానికే ఈ ఎక్సోస్కెలెటిన్ సూట్ డెవలప్‌మెంట్‌పై అమెరికా దృష్టి పెట్టింది.
చూడడానికి రోబోలా కనిపిస్తున్న ఈ పరికరం పేరే సార్కోస్ ఎక్సో స్కెలెటిన్. సార్కోస్ అనే సంస్థ దీన్ని డెవలప్ చేస్తోంది. ఇప్పటివరకూ నిర్వహించిన అన్ని టెస్టుల్లోనూ ఇది సక్సెస్ అయ్యింది. దీన్ని శరీరానికి తగిలించుకుంటే చాలు.. సాధారణ మనుషులు కాస్తా ఐరెన్‌మ్యాన్‌లు అయిపోతారు. 20 రెట్ల బలాన్ని దక్కించుకోగలుగుతారు. వంద కేజీల బరువును అత్యంత సులువుగా ఎత్తగలరు.. చెప్పాలంటే భారం అన్నదే ఈ సూట్ వేసుకున్నవారికి తెలియదు.
మెట్లు ఎక్కడంలోనూ.. ఎత్తైన ప్రాంతాలకు చేరుకోవడంలోనూ ఈ సూట్ ఎంతగానే సహాయ పడుతుంది. అల్యూమినియంతో తయారైన ఈ ఎక్సోస్కెలెటిన్‌ను వేసుకోవడంవల్ల అదనపు భారమూ పడదు. పైగా యుద్ధక్షేత్రంలో ఎక్కువ బరువును మోసుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ సూట్ ధరిస్తే.. బరువు మోస్తున్నామన్న ఫీలే సైనికుడికి కలగదట. అందుకే ఈ సూట్ వేసుకోని అవసరమైన పరికరాలను పదార్థాలు వీపున కట్టుకుని ఎంత దూరమైనై వెళ్లిపోవచ్చు. అంతేకాదు.. తోటిసైనికులు గాయపడితే ఈ సూట్ వేసుకొని వారిని రక్షితప్రాంతానికి ఈజీగా మోసుకువెళ్లవచ్చు. 2015 కల్లా ఈ సూట్‌ను అందుబాటులోకి తేవాలని అమెరికా ప్రయత్నిస్తోంది.

అంతులేని బలం


జిమ్‌కు వెళ్లి వంద కేజీల బరువును రెండు మూడు సార్లు ఎత్తాలంటేనే ఆపసోపాలు పడపోతాం. కానీ, ఈ ఎక్సో స్కెలెటిన్ ధరిస్తే.. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదువందల సార్లు ఎత్తినా ఏమాత్రం అలసట రాదు. ఈ సూట్ స్పెషాలిటీ తెలుసుకోవడానికి ఇది చాలు. ఈ సూట్‌లో రెండు పవర్డ్ లెగ్స్ ఉంటాయి. ఓ మినీ కంప్యూటర్ కూడా ఈ సూట్‌లో నిక్షిప్తమై ఉంటుంది. మనిషి శరీర కదలికలను గుర్తిస్తూ.. దానికి అనుగుణంగా రోబోటిక్ లెగ్స్ పనిచేసేలా ఈ కంప్యూటర్ చూస్తుంది. బరువులు మోయడానికి వీలుగా వీపుపై ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఈ సూట్ వేసుకున్న తర్వాత వంద కిలోల వరకూ బరువును ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకువెళ్లవచ్చు. ఈ బరువునంతటినీ మనం ధరించిన ఎక్సో స్కెలెటన్ మోస్తుంది కాబట్టి దాని ప్రభావం సూట్ వేసుకున్నవారిపై పడదు.
ఈ సూట్‌ను వేసుకోవడం వల్ల నడవడానికి ఎక్కువగా కష్టపడక్కర్లేదు. అంతేకాదు... ఈ సూట్ వేసుకుని నడిస్తే ఎనర్జీ కూడా చాలా తక్కువే వినియోగించుకోవచ్చు. పైగా ఎలాంటి ప్రాంతంలోనైనా అవలీలగా నడవవచ్చు. బరువులు మోస్తూ నడుస్తున్న ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ప్ర్తత్యేకంగా షాక్ అప్ జార్స్ ఉంటాయి. అంతేకాదు.. వంద కిలోల బరువును మోస్తూ కూడా మనం పరుగులు పెట్టవచ్చు.
కూర్చున్నా, నిలుచున్నా, పాకినా.. మన శరీరాన్ని ఎలా కదిపినా ఈ ఎక్సోస్కెలెటిన్ మనకు ఇబ్బందిగా అనిపించదు. మన శరీరంతో పాటే కదులుతుంది. ఈ సూట్‌తో అవసరం లేదనుకున్నప్పుడు క్షణాల్లో విప్పేయవచ్చు. ఓ బ్యాగ్‌లా ఫోల్డ్ చేసి భుజాన తగిలించుకుని వెళ్లిపోవచ్చు. తీయడమే కాదు.. వేసుకోవడమూ చాలా సులువు.
మనిషికి తగ్గట్లుగా అడ్జెస్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ సూట్‌లో ఉంటాయి. మినీ కంప్యూటర్ ఆధారంగా మనకు కావల్సినట్లు ఎక్సోస్కెలెటన్ బిహేవియర్‌ను మార్చుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టే.. ఈ ఎక్సో స్కెలెటన్‌పై అమెరికా సైన్యం అంత మోజు చూపిస్తోంది.

సామాన్యుల కోసం కూడా..


కాళ్లకు పట్టీలతో ఇలా నడుస్తున్నారమేటి అని అనుకుంటున్నారా..? ఎక్సో స్కెలెటిన్‌లో ఇది మరో రకం. అయితే.. ఇవి మాత్రం సైనికుల కోసం వాడేవి కాదు. అంతకుమించిన ప్రయోజనం అందించడం కోసం. మానవాళి అందరికీ సహాయం చేయడం కోసం. దీనిపేరు హైబ్రిడ్ అసిస్టివ్ లింబ్. జపాన్‌లో తయారైన ఈ పరికరం ఇప్పుడు ఎంతోమందిలో ఆశలు మొలకెత్తిస్తోంది.
వృద్దాప్యంతో నడుము పడిపోయిన వారు, ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకున్నవారు, వీల్‌చైర్‌కే పరిమితమైన వారు మళ్లీ లేచి పరుగులు తీసేలా చేస్తుంది ఈ హైబ్రిడ్ లింబ్. దీన్ని తొడుక్కుంటే చాలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడవగలరు. హాస్పిటల్స్‌లో ఉపయోగకరంగా ఉండే ఎక్సో స్కెలెటన్‌లను తయారు చేసే పనిలో జపాన్ పరిశోధకులు బిజీగా ఉన్నారు. ఎంతటి బరువునైనా ఎత్తగలిగే మెషిన్‌ను తయారు చేస్తున్నారు.
వీల్‌చైర్ల అవసరం లేకుండా రోగులను చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తీసుకువెళ్లాలన్నది పరిశోధకుల ప్లాన్. అందుకే, ఎక్సోస్కెలెటన్‌ను అమర్చి ఇలా ప్రయోగాలు కూడా చేస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, నడవలేని వారంతా మళ్లీ మామూలు మనుషులు కావడం ఖాయం.

16, నవంబర్ 2010, మంగళవారం

పదేళ్ల ఎన్టీఆర్


సినిమాను చూడడం వేరు.. సినిమాల్లో నటించడం వేరు. కానీ, వెండితెరనే ప్రపంచంగా, సినిమానే జీవితంగా మార్చుకునేవాళ్లు.. .సినిమా అన్న పదాన్నే శ్వాసిస్తూ.. జీవితాన్ని గడపాలనుకునేవారు కొంతమందే ఉంటారు. అలాంటివారిలో ఒకడు.. ఎన్టీఆర్. అందుకే.. పదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలు.. మరెన్నో ప్రయోగాలు..
ఎన్టీఆర్... పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వెండితెరపై అడుగుపెట్టినా.. అతి తక్కువకాలంలోనే తన నటనతో తారాస్థాయికి చేరుకోలిగాడు. తాతకు తగ్గ మనవడనిపించుకోగలిగాడు. బాలనటుడిగానే నటజీవితం మొదలైనా... పూర్తిస్థాయి హీరోగా మారి ఇప్పటికి (నవంబర్ 16, 2010) సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. సరిగ్గా ఇదే సమయంలో ఎన్టీఆర్లో మరో కోణాన్ని అభిమానులకు చూపించింది బృందావనం.
ఎన్టీఆర్ పేరు చెప్పగానే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. కానీ, బృందావనంలో మాత్రం రోటిన్‌కు భిన్నంగా, డిఫరెంట్ గెటప్‌లో కనిపించి అందరినీ మెప్పించాడు ఎన్టీఆర్. మాస్‌ మాత్రమే కాదు.. క్లాస్ కూడా మెచ్చుకునే గోవిందుడు అందరివాడనిపించాడు. ఎన్టీఆర్ కెరీర్‌లో బృందావనం సినిమాది ప్రత్యేకస్థానం. తన గెటప్‌ను, యాక్టింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసుకుని సరికొత్తగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించాడు. అంతేకాదు, లవర్‌బాయ్‌లా కనిపించి, తోటి హీరోలకు సవాల్ విసిరాడు.

యాక్షన్ కింగ్


డైలాగ్స్‌ను పర్‌ఫెక్ట్‌గా చెప్పడంలో ఎన్టీఆర్ స్టైలే వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో డైలాగ్ కింగ్ ఎన్టీఆర్ మాత్రమే. ఆవేశాన్ని మాత్రమే కాదు నవరసాలను తన గొంతులో పలికించగల నటుడు ఎన్టీఆర్. అందుకే, ఎన్టీఆర్ ఏ డైలాగ్ చెప్పినా అది సూపర్ హిట్టే. జనం కేరింతలు కొట్టాల్సిందే. డైలాగ్స్‌ లేని సన్నివేశాలను ఫీలింగ్స్‌తో నడిపించగల సమర్ధుడు ఎన్టీఆర్. ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్లోని నటకౌశలం పూర్తిగా బయటపడుతుంది.
మాస్‌ను మెప్పించడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. అందుకే, పదేళ్లలో ఎన్టీఆర్ హీరోగా నటించిన పదిహేడు సినిమాల్లో ఎక్కువ భాగంయాక్షన్ సినిమాలే. లవ్,కామెడీ ఎంటర్‌టైరనర్స్‌లా కొన్ని సినిమాలు కనిపించినా, వాటిలోనూ యాక్షన్‌పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. ఎన్టీఆర్ సినిమాల్లో ఫైట్స్‌ స్పెషల్ రేంజ్‌లో ఉంటాయి. సినిమా ఎలాంటిదైనా, ఎన్టీఆర్ మార్క్ ఫైట్స్ మాత్రం తప్పకుండా ఉండాల్సిందే.
తొలి సినిమా నుంచి ఫైట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాడు తారక్. బాబాయ్ బాలకృష్ణకు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉండడం, నందమూరి ఫ్యామిలీ నుంచి రావడంతో, మూడో సినిమాకే పూర్తిస్థాయి మాస్ సినిమావైపు అడుగులు వేయాల్సి వచ్చింది. చెప్పాలంటే మాస్‌ఫార్ములాను ఎన్టీఆర్ ఎంచుకోవడం వల్లే, తక్కువ కాలంలో టాప్ హీరోగా ఎదిగగలిగాడు.


స్టెప్పుల్లో రారాజు


టాలీవుడ్‌లో డ్యాన్స్‌కు కేరాఫ్ అడ్రస్ ఎన్టీఆర్. చిన్నప్పటినుంచి డ్యాన్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపించే ఎన్టీఆర్.. సినీరంగ ప్రవేశం చేసిన తర్వాత డ్యాన్స్‌తో మరింతగా మమేకమయ్యాడు. డైలాగ్స్, యాక్షన్ ఎన్టీఆర్‌కు ఎంత పేరు తెచ్చిపెట్టాయో.. స్టెప్పులు కూడా అంతే కీర్తిని అందించాయి. కళ్లు చెదిరే స్టెప్పులు వేయడం ఎన్టీఆర్ మాత్రమే సాధ్యం.
హెవీ పర్సనాలిటీతోనూ అదిరిపోయే డ్యాన్స్ చేయడం ఎన్టీఆర్‌కు మాత్రమే చెల్లింది. టాలెంట్‌ ముందు అడ్డంకులేవీ ఉండవని ఎన్నో సార్లు నిరూపించాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుంటే చాలు.. ఎలాంటి స్టెప్పులు వేసి ఉంటాడా అని అభిమానులు ఎదురు చూసేలా చేశాడు. హెవీ పర్సనాలిటీతోనే అదరగొట్టేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత సైజ్ తగ్గి దుమ్ము దులిపేశాడు.
ఎన్టీఆర్ సినిమాల్లో పాటలే స్పెషల్ అట్రాక్షన్. అందుకనే ప్రతీసినిమాలోనూ అన్ని రకాల పాటలు ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్తపడతారు. మాస్‌ను మెప్పించే సాంగ్స్‌తోపాటు.. సోలో, కామెడీ, ఐటెం సాంగ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు.
ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడమంటే హీరోయిన్లకు సవాలే. ఎన్టీఆర్‌తో సమానంగా చేయలేక, అంత వేగంగా కదల్లేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందుకే, కష్టమైన స్టెప్పులు స్క్రీన్‌పై ఎన్టీఆర్ మాత్రమే చేస్తాడు. ఆ తర్వాతే హీరోయిన్లు జతకలిసి ఆడిపాడతారు.

కలెక్షన్లలో మేటి

బృందావనానికి మాత్రమే కాదు, ఎన్టీఆర్ సినిమా విడుదలైన ప్రతీసారి ఇదే పరిస్థితి. ఫస్ట్‌డేనే ఫస్ట్ షో చూడడం కోసం ఫ్యాన్స్ ఎగబడతారు. టికెట్ బ్లాక్‌లో కొనైనా, సినిమా చూసేయాలన్నది నందమూరి ఫ్యాన్స్ ఫిలాసఫీ. అందుకే, యంగ్ హీరోల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే హీరోగా ఎన్టీఆర్ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంటాడు.
నవంబర్ 16. 2000. ఎన్టీఆర్ లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని రోజు. తొలిసారి హీరోగా కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చిన రోజు. అప్పటికి ఎన్టీఆర్‌పై ఎవరికీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణంలో బాలనటుడిగా కనిపించినా, ఎన్టీఆర్ హీరోగా మారతాడని, ఇండస్ట్రీ తన పేరు కలవరించేలా చేస్తాడని ఎవరూ అనుకోలేదు. నందమూరి ఫ్యామిలీ ఇమేజ్ తోడున్నప్పటికీ, సొంత టాలెంట్‌వల్లే టాప్ హీరో కాగలిగాడు ఎన్టీఆర్.
తొలి సినిమా నిన్నుచూడాలని నిరాశ పరిచినా, రెండో సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు ఈ నందమూరి నటవారసుడు. స్టూడెంట్ నెంబర్ వన్‌తో అందరి మనసుల్లోనూ చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశాడు. ఆది దెబ్బకు పెద్ద హీరోలే కలవరపడే పరిస్థితిని తెచ్చాడు. ఆదితో ఎన్టీఆర్‌లోని మాస్ హీరో నిద్రలేచాడు. సింహాద్రితో తన పవర్‌ను అందరికీ చూపించాడు.. బాక్సాఫీస్ వసూళ్లలో అగ్రహీరోలను మించిపోయాడు. చెప్పాలంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూడంటే మూడేళ్లలోనే టాప్‌స్టార్‌గా ఎదిగిపోయాడు.
అయితే.. ఆ తర్వాత మాత్రం వరసగా పరాజయాలు వెక్కిరించాయి. సింహాద్రి తర్వాత రాఖీ వరకూ మధ్యలో 5 సినిమాలు చేసినా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. రాఖీ విజయంతో ఎన్టీఆర్ నిరీక్షణ ఫలించింది. ఆ తర్వాత యమదొంగ సినిమా ఎన్టీఆర్‌కు కొత్త ఉత్సాహాన్నిఅందించింది. యముడిగా కనిపించిన ఎన్టీఆర్ పౌరాణికపాత్రల్లోనూ మెప్పించగలనని నిరూపించుకున్నాడు.
యమదొంగ తర్వాత అదుర్స్, తాజాగా బృందావనం సక్సెస్‌తో మళ్లీ విజయాల బాటలో పయనిస్తున్నాడు ఎన్టీఆర్. యమదొంగ నుంచి మళ్లీ
ఎన్టీఆర్ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురవడం మొదలయ్యింది. ప్రతీసినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. అదుర్స్‌కు, బృందావనానికి ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రావడమే ఇందుకు నిదర్శనం.

నిత్యవిద్యార్థి


చిన్న వయస్సులోనే స్టార్ హోదా వచ్చేసింది. సినిమా కలెక్షన్లు అంచనాలను దాటి పోయేవి. ఎన్టీఆర్ ఇండస్ట్హ్రీలో అడుగుపెట్టిన మూడేళ్ల తర్వాత పరిస్థితి ఇది. ఇంకా చెప్పాలంటే సింహాద్రి సమయానికి మంచి స్వింగ్‌లో ఉన్నాడు తారక్. మాస్ స్టోరీలకు ఏకైక యంగ్‌హీరోగా ఇండస్ట్రీకి కనిపించాడు. అంతే వరసగా ఎన్నో స్టోరీలు ఎన్టీఆర్ కోసం రెడీ అయ్యాయి. మాస్ ఇమేజ్ ఉండడంతో ఎన్టీఆర్ కూడా వాటివైపే మొగ్గు చూపాడు. కానీ, అది రాంగ్‌స్టెప్ అని త్వరలోనే అర్థమయ్యింది. అందుకే, రోటీన్ ఫార్ములాను వదిలి రాఖీగా ప్రత్యక్షమయ్యాడు.
రాఖీ సినిమా సమయానికి ఎన్టీఆర్ పర్సనాలిటీ బాగా పెరిగిపోయింది. వయసుకు మించిన శరీరంతో కనపడేసరికి అందరినుంచీ విమర్శలు మొదలయ్యాయి. అప్పటివరకూ నటనపైనే తప్ప శరీరంపై దృష్టి పెట్టని ఎన్టీఆర్ ఇక రూపు మార్చుకోకతప్పదని డిసైడ్ అయ్యాడు. అంతే, యమదొంగలో కొత్త ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కనిపించాడు. అప్పటి నుంచి దాన్నే ఫాలో అవుతున్నాడు.
రాఖీ తర్వాత ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్‌లోనూ ఎంతో తేడా కనిపించింది. మూస పాత్రలకు నో చెప్పి, అందరికీ చేరువ కావాలని నిర్ణయం తీసుకున్నాడు. కేవలం ఫైట్లు చేసి, హాడావిడి చేయడమే కాక, తనను సంపూర్ణ నటుడిగా నిరూపించుకోవాలని తపనపడ్డాడు. అందుకే, అదుర్స్‌లో చారి పాత్రలో కామెడీతో కుమ్మేశాడు. అంతటితో సరిపెట్టుకోలేదు, బృందావనంతో లవర్‌బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.
ఇకపై లవర్‌బాయ్‌గానే సెటిల్ అయిపోతాడా అంటే లేదనే చెప్పాలి. శక్తి రూపంలో మళ్లీ మాస్‌హీరోగా అభిమానులకు కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. ఇకపై ఒకే తరహా పాత్రలకు పరిమితం అయ్యే అవకాశాలు మాత్రం లేవు. ఎప్పటికప్పుడు విభిన్నంగా కనిపిస్తూ.. ఈ తారకరాముడు అందరివాడని అనిపించుకోవాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు.. తన తాత నటించిన గుండమ్మకథ, పాతాళభైరవి లాంటి టాలీవుడ్ క్లాసిక్స్‌ను రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ధుర్యోధనుడి పాత్రకే కళతెచ్చేలా సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరశూర కర్ణలో జూనియర్ కనిపించాలని ముచ్చటపడుతున్నాడు. ఆ కోరికా త్వరలోనే తీరాలని ఆశిద్దాం. ఒకేమూస పద్ధతికి అతుక్కోకుండా, మళ్లీ పర్సనాలిటీ పెంచకుండా, ఎన్నో అద్భుతమైన పాత్రల్లో అభిమానులకు ఎన్టీఆర్ కనిపించాలని ఆశిద్దాం..

14, నవంబర్ 2010, ఆదివారం

డిజిటల్ లైఫ్ లోకి ప్రవేశించండి

మీ మధురానుభూతులను మరింత మధురంగా మార్చుకోండి. పెళ్లి వేడుకలు, పుట్టినరోజు సంబరాలు, పండుగలు ఇలా సందర్భం ఏదైనా దాన్ని డిజిటల్ ఆల్బంగా మార్చుకోండి. సాధారణ ఆల్బమ్ లతో పోల్చితే ఇది ఖర్చు తక్కువ. పైగా, అందరూ ఒకేసారి చూడొచ్చు. డీవీడి ప్లేయర్ గానీ, కంప్యూటర్ గానీ ఉంటే చాలు, అంతా కలిసి సినిమాలా చూసి ఎంజాయ్ చేయవచ్చు. పైగా ఫోటోలు పాడయ్యే అవకాశాలూ లేవు. ఎక్కడికి కావాలంటే అక్కడికి మీ ఆల్బమ్ ను సులువుగా తీసుకువెళ్లవచ్చు. మీ ఫోటోలను కూడా ఇలా మార్చుకోవాలనిపిస్తే సంప్రదించండి. ప్రస్తుతం ఈ అవకాశం హైదరాబాద్ వాసులకు మాత్రమే. శాంపిల్ వీడియోను చూడండి.


12, నవంబర్ 2010, శుక్రవారం

జై బోలో


రూటు మారింది..
సీన్ మారింది..
వేషం మారింది...
తెలుగు హీరోలందరిదీ అదే దారి..
అదే తెలంగాణ దారి
అడుగడుగునా ఆవేశం... ప్రతీ క్షణం పోరాటం. తెలంగాణ సాధనే ధ్యేయం. ఉద్వేగం.. ఉద్రిక్తభరితం. జైబోలో తెలంగాణ సినిమాలో హీరో జగపతిబాబు పోషిస్తున్న క్యారెక్టర్ స్వరూపమిది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు జగపతి. సినిమాలో ఇదే కీలకపాత్ర. వరంగల్‌లో జరుగుతున్న షూటింగ్‌లో జగపతి పాల్గొంటున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు తెలంగాణ సాధన కోసం ఆత్యత్యాగం చేస్తారన్న ప్రచారమూ ఉంది. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేస్తున్న జైబోలో తెలంగాణ సినిమాను డిసెంబర్ చివరికల్లా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిత్రసీమలోని ప్రముఖలంతా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇండస్ట్రీలో ప్రాంతీయ బేధాలు లేవని, అన్ని ప్రాంతాలు తమకు సమానమేనని చాటిచెప్పారు.

అంతా సానుకూలం


తెలంగాణ అనే పదాన్ని తెలుగు సినిమా దరిదాపుల్లోకి కూడా రానివ్వని సినీ సామ్రాజ్యవాదులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. ఇంతకాలం తెలుగు సినిమాలకే జైకొట్టిన హీరోలు ఇప్పుడు తెలంగాణాకు జై కొడుతున్నారు. ఇంతవరకూ బతుకమ్మ, ధూంధాం వంటి చిన్న చిన్న సినిమాలు మాత్రమే తెలంగాణ కథాంశంతో రూపుదిద్దుకోగా, ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. శంకర్ రూపొందిస్తున్న జైబోలో తెలంగాణ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉండగా, నాగార్జున కథానాయకుడిగా మరో తెలంగాణ సినిమా రెడీ అవుతోంది.
కమర్షియల్ సినిమాలతో పాటు, భక్తిప్రాధాన్య చిత్రాలతోనూ ఆకట్టుకున్న నాగార్జున ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో రాజన్నగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రాజన్న సినిమాలో తెలంగాణ యువకుడిగా నాగార్జున్న కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో ఫైట్స్‌ను రాజమౌళి డైరెక్ట్ చేస్తుండడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఓ యదార్ధగాథ ఆధారంగా తయారవుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్న అంచనాలో ఉంది సినిమా యూనిట్.

కొమరం భీమ్‌గా బాలయ్య

సింహా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటోంది పరమవీరచక్ర. దాసరి-బాలయ్యల కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. పైగా ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులికి రీమేక్ అన్న ప్రచారమూ పరమవీరచక్రపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలకృష్ణ వేస్తున్న ఓ గెటప్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. బాలకృష్ణ పోషిస్తున్న ఆ గెటప్ మరోమిటో కాదు.. గోండు వీరుడు, నైజాంపై తిరుగుబాటు చేసిన అడవిబిడ్డ కొమరం భీమ్. పరమవీరచక్రలో కొమరం భీం పాత్రలో బాలకృష్ణ ప్రత్యేకంగా కనిపించబోతున్నారు. దీనికి సంబంధించి ఓ పాటను కూడా ఇప్పటికే స్వరపరిచారు. కొమరంభీమ్‌ను వీరోచితగాధను ప్రస్తుతిస్తూ ఈ పాట సాగుతుంది.
సినీగేయరచయత సుద్దాల అశోక్‌తేజతో ప్రత్యేకంగా ఈ పాటను రాయించారు. కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుంది. దాదాపు 6 నిమిషాల పాటు ఉండే కొమరం భీం పాట, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని దాసరి భావిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్ర బాలకృష్ణ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలుస్తుందన్న భావనా వ్యక్తమవుతోంది.

ఉద్యమ ప్రభావమే..

తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తీవ్రంగా ఇబ్బందులు పడింది తెలుగు చిత్ర పరిశ్రమ. రాష్ట్ర విభజనపై ఆందోళనలు తారాస్థాయిలో సాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు సమైక్యవాదాన్ని వినిపించడంపై రగడ మొదలయ్యింది. తెలంగాణలో చాలా సినిమాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. థియేటర్లపై దాడులు జరిగాయి.
దాదాపు ఏడాది కాలంగా ఈ చిచ్చు రగులుతూనే ఉంది. ఇటీవలి కాలంలో కొమరం పులి అంటూ పవన్ కళ్యాణ్ తీసిన సినిమా కూడా తీవ్ర వివాదాస్పదమయ్యింది. సమైక్యవాదులన్న ముద్ర పడడంతో సినిమాలో కొమరంపులి పేరు పెట్టుకుని తెలంగాణలో సానుకూల పరిస్థితులను సృష్టించుకోవాలని పవన్ ప్రయత్నించారు. అయితే, ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలే చిరంజీవి ఫ్యామిలీ సమైక్యవాదం వినిపించడంపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణవాదులు, ఈ సినిమా పేరుపై తీవ్రంగా స్పందించారు. చివరకు సినిమా టైటిల్ నుంచి కొమరం పదాన్ని తొలగించాల్సి వచ్చింది.
తెలంగాణ విషయంలోనూ ఇలా వ్యవహరిస్తే స్థానికులు ఏమాత్రం అంగీకరించన్న విషయం ఈ సినిమాతో ఇండస్ట్రీకి అర్థమయ్యింది. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇకపై వ్యవహరించకూడదన్న అభిప్రాయానికి ఇండస్ట్రీ వచ్చింది. అందుకే, ప్రాంతీయ తేడాలు చూపించకుండా సినీ ఇండస్ట్రీకి అంతా సమానేమనని చాటిచెప్పాలనుకొంది. తెలుగు హీరోలు వరసగా తెలంగాణ చారిత్రక సినిమాల్లో, తెలంగాణ పాత్రల్లో నటించడానికి ఇదే ప్రధాన కారణం. ఇలా నటించడం వల్ల తెలంగాణ ప్రేక్షకులకు మరింత దగ్గర కావచ్చు.
తెలుగు హీరోలు తెలంగాణ వైపు దృష్టి పెట్టడంపై అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అన్ని రకాల క్యారెక్టర్లు వేయడమే ఆర్టిస్టు లక్షణమైనప్పుడు.. తెలంగాణ పాత్రల్లో నటించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదంటున్నారు సినీరంగ ప్రముఖులు. ఇంతకాలం తెలుగు ఇండస్ట్రీ వ్యవహరించిన తీరు వేరు.. ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు వేరు. అన్ని ప్రాంతాలకూ ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమ, ఏ ప్రాంతాన్ని వదులుకోవాలని భావించడం లేదు. రాష్ట్రం కలిసి ఉన్నా, విడిపోయినా, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం ఒకటిగానే ఉండాలని కోరుకుంటోంది.

వ్యాపారసూత్రమూ అదే..

సినీ ఇండస్ట్రీ మనసు మార్చుకోవడం వెనుక కీలకమైన మరో అంశమూ ఉంది. అవే కలెక్షన్లు. తెలంగాణ వాదాన్ని వ్యతిరేకిస్తే, కీలకమైన నైజాం ఏరియాలో కలెక్షన్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీబడ్జెట్ సినిమాలకు ఓపెనింగ్సే కీలకం. ఆందోళనలతో సినిమా విడుదలకు ఇబ్బందులు ఎదురైతే, కలెక్షన్లు తగ్గిపోతాయి. లాభాలు తెచ్చి పెట్టే సినిమా కూడా నష్టాల పాలవుతుంది. ఈ విషయాన్ని గుర్తించారు కాబట్టే, నిర్మాతలు,దర్శకులు, హీరోలు.. ప్రాంతీయతత్వాలను వదిలివేస్తున్నారు.
అంతేకాదు ఇక్కడ గమనించాల్సిన మరో కీలకాంశం.. కథ తెలంగాణది, కథానాయకులు ఆంధ్రాహీరోలు. ఇదే అసలు కమర్షియల్ ఫార్ములా. ఈ సూత్రంతోనే రెండు ప్రాంతాల్లోనూ సినిమాను అమ్ముకోవచ్చు. అంతేకాదు, ఇలా తెలంగాణ సినిమాల్లో నటించడం వల్ల హీరోలకూ మేలు జరుగుతుంది. వారు తీసే ఇతర సినిమాలకూ తెలంగాణలో అడ్డంకులు ఉండవు. అందుకే, తెలంగాణ సినిమాల నిర్మాణం ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఊపందుకొంది.

రౌడీరాజ్యం


నడిరోడ్డుపై పరుగులు పెట్టిస్తారు...
కనికరం లేకుండా చావబాదుతారు..
పక్కాగా స్కెచ్ వేసి అటాక్ చేస్తారు..
ప్రత్యర్థి ప్రాణం తీయడమే లక్ష్యం
అందుకు పట్టపగలైనా... అర్థరాత్రైనా ఒకటే..
ఇవన్నీ సినిమాల్లో కనిపించే దృశ్యాలు. కథను రక్తి కట్టించే సన్నివేశాలు. రౌడీయిజానికి అసలైన ప్రతిరూపాలు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఈ దృశ్యాలు ఇప్పుడు నడిరోడ్డుపై దర్శనిమస్తున్నాయి. ఒకప్పుడు చీకటిమాటున జరిగే హత్యలు ఇప్పుడు పట్టపగలే చోటుచేసుకుంటున్నాయి. జనమంతా చూస్తుండగానే రౌడీలు తెగబడుతున్నారు. భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అందుకు నిదర్శనం... హైదరాబాద్ నాంపల్లి కోర్టుల సమీపంలోనే జరిగిన రౌడీషీటర్ ఫజల్ దారుణ హత్య.
నాంపల్లి కోర్టులు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. ఎంతోమంది పోలీసులు అక్కడే ఉంటారు. పైగా నగరంలోని కీలకమైన ప్రాంతం. చిన్నపాటి గొడవపడాలంటేనే సామాన్యుడు భయపడతాడు. కానీ, ఫజల్ ప్రత్యర్థులు మాత్రం ఆ ప్రాంతాన్నే తమ ప్లాన్ ను అమలు చేయడానికి వేదిక చేసుకున్నారు. ఫజల్ కోసం కోర్డు దగ్గరే కాపు కాశారు. ఓ కేసులో కోర్టుకు హాజరైన ఫజల్ తిరిగి వెళుతుండగా వెంటాడారు. ఫజల్ వెళుతున్న బుల్లెట్‌ను సుమోతో ఢీకొట్టించారు. ఫజల్ కూడా రౌడీ షీటర్ కావడంతో మ్యాటర్ అర్ధమైపోయింది. అంతే, బండి వదిలి పరుగు లంకించుకున్నాడు. అతని వెనకాలే.. ప్రత్యర్థులు పరుగులు పెట్టారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లిన ఫజల్, ప్రాణాలు దక్కించుకోవడానికి ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఓ ఇంటిలోకి వెళ్లి కిచెన్‌లో దాక్కున్నాడు. దీన్ని గమనించిన రౌడీలు... అదే కిచెన్‌లో చుట్టుముట్టి కత్తులతో నరికి చంపారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ హత్య జరిగింది. అసలు రౌడీలకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది.? అందరిముందూ హత్య చేసేంత తెగింపు ఎలా వచ్చింది..?

హత్యల కేంద్రం

హైదరాబాద్... ప్రభుత్వం మొత్తం కొలువై ఉండే ప్రాంతం. డీజీపీ దగ్గర నుంచి పోలీసు పెద్దలంతా నిత్యం విధులు నిర్వహించే నగరం. సిటీ మొత్తాన్ని పర్యవేక్షించడానికి దాదాపు 10 వేల మందికి పైగా సిబ్బంది.. అందరిపైనా ఓ సూపర్‌బాస్‌గా.. సిటీ పోలీస్‌కమీషనర్. పైగా.. శివారు ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రత్యేకంగా మరో కమిషనరేట్. అక్కడా పదివేల మంది స్టాఫ్. అయినా... రౌడీల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. పైపెచ్చు రోజురోజుకూ వీరి దూకుడు పెరిగిపోతోంది. గుట్టుగా దందాలు చేసే వారు కాస్తా ఇప్పుడు పట్టపగలే దౌర్జన్యాలు చేసే స్థాయికి ఎదిగిపోయారు. చెప్పాలంటే.. నడిరోడ్డుపై అందరిముందూ వెంటాడి వేటాడి చంపేవాళ్లయ్యారు.
వరుసగా మర్డర్లు. ప్రతీరోజూ హత్యలు. చంపడం అన్నది ఇప్పుడు సింపుల్ అయిపోయింది. ప్రాణం తీయడానికి భయపడే రోజులు పోయాయి. ఏమాత్రం తేడా వచ్చినా.. మనుషులమన్న విషయాన్ని మరిచిపోతున్నారు. రాక్షసులుగా మారిపోతున్నారు. పట్టపగలే చంపేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని, చట్టం శిక్షిస్తుందని.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందన్న మాటలు.. హంతకుల చెవులకు వినపడడం లేదు. వాస్తవంలో ఇవి నిజమవుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. చెప్పాలంటే... హంతకులకు, రౌడీలకు, గుండాలకే చట్టం చుట్టమై కూర్చొంది. అందుకే.. నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి.
ముంబై మాఫియా తరహాలో హైదరాబాద్‌లో గ్యాంగ్‌వార్ పెరిగిపోతోంది. వరసగా హత్యలకు పాల్పడుతూ రౌడీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు. ప్రైవేట్ సెటిల్‌మెంట్లతో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. ఫజల్ మర్డర్‌కు కోట్లాది రూపాయల విలువైన స్థలమే కారణమన్న అనుమానాలున్నాయి. చర్లపల్లి జైల్లో మొదలైన గొడవ... నాంపల్లిలో మర్డర్ చేసే వరకూ సాగింది. రాజధానిలో బస్తీకొకటి చొప్పున వెలుస్తున్న గుండాగ్యాంగ్‌లు ఆధిపత్యం కోసం పోరాడుతూ ఎన్నో హత్యలకు తెగబడుతున్నాయి. కొంతకాలం క్రితం బోరబండలోనూ ఇదే తరహాలో హత్య వెలుగుచూసింది. ఆటోలో వెంటాడి ఓ రౌడీషీటర్‌ను హత్య చేశారు. హిమాయత్‌సాగర్ వద్ద హజీ అనే రౌడీషీటర్‌ను ఇదే తరహాలో ప్రత్యర్థులు మట్టుబెట్టారు. హఫీజ్‌పేటలో నాంపల్లి రౌడీషీటర్ ఫిరోజ్‌ను మర్డర్ చేశారు. టీడీపీ నేత, బెజవాడ రౌడీ షీటర్ చలసాని పండు కూడా హైదరాబాద్‌లో అనుచరుడి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పుడు ఫజల్‌ను మరో వర్గం హత్య చేసింది. ఇన్ని హత్యలు జరుగుతున్నా.. రౌడీషీటర్ల మధ్య వార్ తీవ్రస్థాయిలో సాగుతున్నా.. పోలీసులు ఏం చేస్తున్నారు. నగరంపై అనుక్షణం నిఘా ఉంచాల్సిన వారు... నిద్రపోతున్నారా...? రౌడీషీటర్లపైనే నిఘా లేకపోతే.. గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి వచ్చే మాఫియాముఠాలు, టెర్రరిస్టుల ఉనికిని ఎలా పసిగడతారు..?

మృగానందం


శాడిజానికి పరాకాష్ట, క్రూరత్వానికి అద్దం పట్టే సంఘటన నల్గొండ జిల్లాలో జరిగిన హత్య. ఓ మనిషిని ఎంత దారుణంగా చంపొచ్చో.. అంత క్రూరంగా హత్య చేశాడు ఓ నరరూప రాక్షసుడు. హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అప్పల నాయుడిని కిడ్నాప్ చేసిన యూసఫ్.. అతన్ని నల్గొండ తీసుకెళ్లాడు. అక్కడ చంపిన తర్వాత నాయుడు శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. తలను నల్గొండలోని ప్రకాశం బజార్‌లో, ఓ చెయ్యిని బస్టాండ్ సమీపంలో, దేవరకొండ ప్రభుత్వ కళాశాల సమీపంలో మొండెం...వీటీ కాలనీలో రాజీవ్ విగ్రహం వద్ద కాలు...చిట్యాల వద్ద మరో చేయి..నార్కట్ పల్లిలో మరో కాలు పడేశాడు. వందకిలోమీటర్ల పరిధిలో అప్పల నాయుడు శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఒక్కో చోట ఒక్కో శరీర భాగాన్ని చూసి జనంలో కలకలం మొదలయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి అన్నింటిని ఒక్కచోటకి చేర్చే సరికి అసలు విషయం అర్థమయ్యింది.
ఈ హత్యకు కారణం ఓ వివాహేతర సంబంధం. యూసఫ్ బంధువుతో నాయుడుకి సంబంధాలున్నాయన్న అనుమానంతోనే ఈ హత్యకు ఒడిగట్టాడు యూసఫ్. ఐదు రోజుల క్రితమే నాయుడ్ని కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టి చివరకు ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. నాయుడి విషయంలోనే కాదు.. ఇంతకు ముందుకూడా యూసఫ్ ఎన్నో నేరాలకు ఒడిగట్టాడు. ఎన్నో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఏ సంబంధం లేకపోయినా, రోడ్డుపై కనిపించిన వారిపై దాడి చేసి, వారిపై కత్తులతో దాడి చేసి మృగానందం పొందేవాడు. ఈ విషయం తెలిసినా పోలీసులు పెద్దగా పట్టించుకున్నది లేదు. యూసఫ్‌పై నిఘా పెట్టామని చెప్పుకున్నారే తప్ప.. అతన్ని నియంత్రించలేకపోయారు. దాని ఫలితమే.. ఘోరాతిఘోరమైన నాయుడి హత్య.
హత్యలు చేయడంలోను... జనాన్ని భయపెట్టడంలోనూ హంతకులు ఆరితేరిపోయారు. అందుకే.. ఎక్కడో హత్య చేసి మరీ.. శవాలను జనం మధ్యలోకి తెచ్చి పడేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఇలాంటి సంఘటనే జరిగింది. హైదరాబాద్‌లోని మెహదీపట్నం బస్‌స్టాండ్‌లో పట్టపగలే ఓ పెద్ద సూట్‌కేస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. సూట్‌కేస్‌ గురించి సమాచారం అందడంతో పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. తీరా సూట్‌కేస్ తెరిస్తే.. అందులో మహిళ శవం కనిపించింది. ఎక్కడో హత్య చేసి.. నగరం మధ్యలో ఎందుకు పడేశారు..? గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసే పద్దతి మానుకొని.. శవాన్ని అందరికీ తెలిసేలా పడేయడానికి కారణం ఏమిటి? ఈ మర్డర్ జరిగి మూడునెలలు గడుస్తున్నా.. ఆ శవం ఎవరిదన్న విషయం ఇంతవరకూ తేలలేదు.
దొంగతనాలు, దోపిడీల రూపంలో జరుగుతున్న హత్యాకాండకు లెక్కేలేదు. మనుషుల మధ్య తగాదాలు ఒకప్పుడు ఎక్కువగా శారీరక దాడులకు పరిమితమైతే.. ఇప్పుడు మాత్రం ప్రాణం బలికొనేదిశలో సాగుతున్నాయి. పక్కాగా ప్లాన్ చేసి, ముగ్గులోకి దింపి చేస్తున్న హత్యల సంఖ్యా ఎక్కువే. రాజేంద్రనగర్‌లో గౌస్ అనే క్యాబ్‌ డ్రైవర్‌ను ఇలానే హత్య చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గౌస్‌ను మసీదు సమీపంలో గొంతు కోసి చంపేశారు. ఎవరు చంపారో.. ఎందుకు చంపారో ఎవరికీ తెలియదు.

హత్యలే హత్యలు..

క్రైమ్‌రేట్ అంచనాలు దాటిపోతోంది. నేరమయ సంస్కృతి పెరిగిపోతోంది. నేరాలను అరికట్టడానికి నియమించిన పోలీసులు ఆ విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అందుకే, రాష్ట్రం మర్డర్లకు మారుపేరుగా మారిపోయింది. మనరాష్ట్రంలో నమోదవుతున్న హత్యల లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఈ ఏడాది తొలి అర్థభాగానికే అంటే.. జనవరి నుంచి జూన్ వరకూ 1288 మంది హత్యకు గురయ్యారు. వీటిల్లోనూ రాజధానిదే అగ్రస్థానం. హైదరాబాద్లో ఇదే కాలంలో జరిగిన హత్యల సంఖ్య 173. దీనిబట్టి ఎంత జోరుగా మర్డర్లు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అసలు ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి..? తప్పు చేసిన వారిని శిక్షించడానికి పోలీసులు, చట్టం, కోర్టులు ఇలా ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ హత్యలు ఎందుకు ఆగడం లేదు.? దీనికి సమాధానం చట్టమంటే ఎవరికీ భయం లేదు. హత్య చేస్తే చట్టానికి చిక్కుతామన్న భయం లేదు. ఏవో కొన్ని కేసుల్లో మినహాయిస్తే... అసలైన హంతకులు దొరికిన సంఘటనలూ తక్కువే. ఒకవేళ పోలీసులకు దొరికినా, శిక్ష పడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదే హత్యలు చేసే తెగింపును తెచ్చిపెడుతోంది. నడిరోడ్డుపై ప్రత్యర్థిని నరకడానికి పురిగొల్పుతోంది.
మర్డర్లపై పోలీసుల దర్యాప్తు పక్కాగా జరగడం లేదు. తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. అసలు హంతకులను పట్టుకోలేక అమాయకులను ఇరికించేస్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం హైదరాబాద్‌లో వరసగా జరిగిన మూడు హత్యల్లో.. ఇద్దరు అమాయకులను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. వారే హంతకులని ప్రకటించి, కేసును త్వరగా పరిష్కరించామని భుజాలు చరుచుకున్నారు. మరో మర్డర్‌ను యాక్సిడెంట్‌గా చిత్రీకరించి ఫైల్ మూసేశారు. కానీ, ఓ కేసులో అరెస్టైన వ్యక్తే అసలైన సైకోకిల్లర్‌గా తేలింది. ప్రతీ హత్యను వివరాలతో సహా చెప్పి నేనే చేశానంటూ సైకో చెబితే తప్ప పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇదీ మన రక్షకభటుల తీరు. చట్టాన్ని పరిరక్షిస్తూ, అమాయకులను రక్షించాల్సిన పోలీసులే.. సామాన్యుల పాలిట విలన్లవుతున్నారు. ఇక పోలీసులే ఇలా తప్పుదారుల్లో పరుగులు పెడుతుంటే.. హంతకులకు అడ్డేముంటుంది.
మర్డర్ జరగగానే హడావిడి చేయడం.. హంతకులను పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ప్రకటించడమే తప్ప.. దాన్ని ఆచరణలో మాత్రం చూపించలేకపోతున్నారు. అందుకే, వందలాది మంది తమ ప్రాణాలను హంతకుల చేతుల్లో వదులుతున్నారు. మరి ఈ రౌడీరాజ్యానికి అంతం ఎప్పుడు? ఈ మారణకాండ ఆగేది ఎప్పుడు?

ఇంత దిగంబరమా..? పెద్దవాళ్లకు మాత్రమే..


తెలుగు సినీ పరిశ్రమలో ముద్దుగుమ్మలా మెరిసి, అవకాశాల్లేక మాయమైన గోదావరి హీరోయిన్ కమిలిని ముఖర్జీ, మలయతీరంలో తేలింది. మమ్ముట్టితో కలిసి కుట్టిశ్రాంక్ సినిమాలో నటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ సినిమాలో హాట్ క్యారెక్టర్ను కమిలిని పోషించింది. శృంగారవాంఛలతో రగిలిపోయే ఓ గ్రామీణ స్త్రీగా ఈ సినిమాలో నటించింది. అంతేకాదు, ఈ సినిమా కోసం పూర్తి నగ్నంగా కనిపించిందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఈ సినిమా ట్రయలర్స్లో మెడనుంచి కాలివరకూ పూర్తి దిగంబరంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. కావాలంటే మీరూ Reed more క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. కాకపోతే, బెంగాలీబ్యూటీనే ఇలా నటించిందా... లేక మలయాళ మాత్రికుల ప్రతిభా అన్నది మాత్రం తేలలేదు. ఈ సినిమా గురించి, ఈ సన్నివేశాల గురించి కమిలిని కూడా ఎక్కడా ఇంతవరకూ పెదవి విప్పలేదు.

వీడియో కోసం Reed more క్లిక్ చేయండి.

5, నవంబర్ 2010, శుక్రవారం

జగత్తుకు శోభావళి

వెలుగు దివ్వెల దీపావళి.. జగత్తుకు శోభావళి. ఈ దీపావళి మీ ఇంట్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
- సతీష్ దేవళ్ల


: Click Here To Forward This Scrap/Graphic/Comment To Your Friendz

అల్లు లవ్ మ్యాటర్ లీక్ చేసిందెవరు?


వరుడిగా వెండితెరపై కనిపించిన అల్లువారబ్బాయి... వచ్చే ఫిబ్రవరిలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. తానెవరినీ లవ్ చేయలేదని, వధువును ఎంపిక చేసే బాధ్యత తల్లిదండ్రులదేనని వరుడు ఆడియో ఫంక్షన్లో ఘనంగా ప్రకటించిన అర్జున్, ఇప్పుడు మాత్రం రూట్ మార్చారు. తాను లవ్ చేసిన స్నేహారెడ్డినిచ్చి పెళ్లి చేయమని తల్లిదండ్రులకు చెప్పేశాడు. రెండు కుటుంబాలు మాట్లాడుకుని ఫిబ్రవరిలో వచ్చే ముహూర్తాల్లో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికల్లా బద్రీనాథ్ షూటింగ్ కూడా పూర్తవుతుంది. అయితే.. ఎంతో గుట్టుగా ఇంతకాలం సాగిన బన్నీ ప్రేమవ్యవహారం అకస్మాత్తుగా రట్టయ్యింది. మీడియా ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. టీవీ ఛానళ్లకు ఈ న్యూస్ ఇచ్చిందెవరు..? ఫిల్మ్ నగర్ కథనాల ప్రకారం..
బన్నీ ప్రేమ వ్యవహారాన్ని ముందుగా బయటపెట్టింది నారా చంద్రబాబు తనయుడైన నారా లోకేష్ ఛానల్ స్టూడియో ఎన్. అందరికన్నా ముందుగా స్నేహారెడ్డి ఫోటోతో న్యూస్ ను బ్రేక్ చేసింది. ఆ తర్వాత మిగిలిన ఛానళ్లన్నీ అదే దారిలో పయనించాయి. మీడియాలో హాడావిడి అల్లు అరవింద్ స్పందించక తప్పలేదు. త్వరలోనే పెళ్లి చేస్తామని ప్రకటించారు. అయితే ఈ వార్త మీడియాకు వెక్కడం వెనుక ప్రధాన పాత్ర వధువు తండ్రి కే.సీ.శేఖర్ రెడ్డిదే నని తెలుస్తోంది. పెళ్లి వ్యవహారాన్ని అల్లు అరవింద్ నెలల తరబడి నాన్చుతుండడంతోనే, ఈ ఎత్తు వేశారన్నఅనుమానాలున్నాయి. మీడియాలో వచ్చేస్తే, ఇక అల్లు కుటుంబానికి పెళ్లి చేయక తప్పని పరిస్థితి ఎదురువుతుందన్న అంచనాతోనే ప్రేమవ్యవహారాన్ని లీక్ చేశారని తెలుస్తోంది.

ఇక మరో అనుమానం కూడా ఉంది. అల్లు కుటుంబమే స్వయంగా ఈ మ్యాటర్ను లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ పెద్దగా చదువుకోకపోవడం, స్నేహాకు సరిపడడేమోనన్న అనుమానంతో ఉన్న శేఖర్ రెడ్డిని ఎలాగైనే ఒప్పించే యత్నంలోనే భాగంగా ఈ మ్యాటర్ను మీడియాకు ఎక్కించినట్లు తెలుస్తోంది. మీడియాలో ప్రచారం అయిపోతే, పెళ్లి చేయక తప్పదని, దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కట్నాన్ని గుంజొచ్చని అల్లు ప్లాన్ వేసినట్లు ఇన్ఫర్మేషన్.

ఈ పెళ్లి మ్యాటర్ పై అల్లు అరవిందే ఇంటర్వ్యూలు ఇవ్వడం తప్ప, స్నేహా ఫ్యామిలీ మాత్రం స్పందించడంలేదు. మొత్తంమీద చూస్తుంటే, సడన్ గా అల్లు అర్జున్ ప్రేమ వ్యవహారం బయటపడడం వెనుక ఎన్నో మలుపులున్నట్లు అర్థమవుతోంది.