
చిరంజీవి సినీరంగ పునప్రవేశానికి రంగం సిద్ధమయ్యింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెండితెరకు దూరమైన చిరంజీవి అధినాయకుడిగా మళ్లీ అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఈ టైటిల్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేశారు. సెప్టెంబర్ 29న ఈ టైటిల్‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చిరంజీవితో సూపర్‌హిట్ సినిమా ఠాగూర్‌ను తీసిన నిర్మాత మధు ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారు. అధినాయకుడిలో హీరో చిరంజీవే అన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. సినిమా కథ కూడా ఠాగూర్ తరహాలోనే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్‌లో బిజీగా ఉన్నారు. మరో రెండు మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వొచ్చు.
aa samayam kosame abhimaanulu yeduru choostunnaru
రిప్లయితొలగించండిandhuku babu vacchi malli champuthavu
రిప్లయితొలగించండి