రైలు బండి .. చాలా పెద్దగా ఉంటుంది. ఎక్కడో వెనుక బోగీలో ఉన్నవాడికి అర్జెంట్ పని పడితేనో.. అత్యవసర సమస్య తలెత్తితోనే.. బండిని ఆపడానికి ఏకైక మార్గం చైన్ లాగడం. ప్రతీ బోగీలోనూ ఈ మేరకు ఏర్పాటు ఉంటూనే ఉంది. తరతరాలుగా జనానికి కూడా ఇది బాగా అలవాటయ్యింది. అయితే.. ఇకపై రైలు బోగీల్లో మాత్రం ఈ చైన్ సిస్టం ఉండదు. చైన్ ఉండదు కాబట్టి ఎంత అత్యవసరమైనా రైలు బండి ఆగదు.
రైలు బోగీల్లో చైన్లను తొలగించాలని నిర్ణయించింది రైల్వే శాఖ. ప్రతీ రోజు ప్రయాణీకులు చైన్లు లాగడం వల్ల రోజూ దాదాపు 30 ట్రైన్లు ఆలస్యంగా నడుస్తున్నాయట. పైగా ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయల నష్టం వస్తోందట. దీన్ని నివారించడానికే రైలు బోగీల్లో చైన్ విధానానికి స్వస్తి పలకాలని భావిస్తోంది రైల్వే శాఖ. ఇప్పటికే కొన్ని బోగీల్లో వీటి తొలగింపు మొదలయ్యింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి