తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కొత్త హెలికాప్టర్ కొనడానికి రంగం సిద్ధమయ్యింది. దీనిపై అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ లేదు. జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సివస్తే అద్దె హెలికాప్టర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు హెలికాప్టర్లు ఉండగా, అందులో బెల్ హెలికాప్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యింది. రెండో హెలికాప్టర్ అగస్టా వెస్ట్ ల్యాండ్ బేగంపేటలో అగ్నిప్రమాదంలో కాలి బూడిదయ్యింది. అప్పటి నుంచి ప్రభుత్వానికి హెలికాప్టర్లు లేవు. ప్రైవేటు హెలికాప్టర్లపై ఆధారపడడం కన్నా, ప్రభుత్వం దగ్గరే ఓ హెలికాప్టర్ ఉంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందించమని అధికారులను ఆదేశించారు కేసీఆర్. కొత్త హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి మరో ఆరునెలల సమయం పట్టే అవకాశం ఉంది.
7, అక్టోబర్ 2014, మంగళవారం
కేసీఆర్ కోసం కొత్త హెలికాప్టర్
Categories :
helicopter . kcr . POLITICS . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి