ఒకప్పటి సూపర్ హీరోయిన్.. అందాల రాక్షసి..శిల్పాషెట్టి ఇప్పుడు చీరలమ్ముకొంటోంది. అందేంటి.. హీరోయిన్ గా సంపాదించిన సొమ్ము ఏమైపోయింది.. భర్త రాజ్ కుంద్రా ఆస్తి ఏమైపోయిందని ఆందోళన పడకండి.. ఇదంతా ఆమె సైడ్ బిజినెస్. తన అందచందాలే పెట్టుబడిగా సంపాదనా మార్గాలను నిరంతరం అన్వేషించే శిల్పా.. గతంలోనూ యోగాసనాలు వేసి, ఆ సీడీలు అమ్ముకుని ప్రపంచాన్ని ఊపేసింది. ఆమె పేరుతో కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కూడా సేల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆమె కన్ను చీరలపై పడింది. భారత్‌లోనూ, ప్రవాస భారతీయుల్లోనూ చీరలపై ఉన్న మక్కువను క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగింది. హోమ్ షాప్ 18తో కలిసి ఎక్స్ క్లూజివ్ గా తన డిజైనర్ శ్రేణిని పరిచయం చేసింది. శిల్పాషెట్టి కుంద్రా పేరుతో ఈ చీరలను హోమ్ షాప్ 18 అమ్మకానికి పెట్టింది. ఈ మధ్యే ఢిల్లీలో భారీ ప్రచార కార్యక్రమాన్ని కూడా దీనికోసం ఏర్పాటు చేశారు. హీరోయిన్ పేరుతో వచ్చిన చీరలు కాబట్టి.. వీటి రేటు కాస్త ఎక్కువగానే కనిపించవచ్చు.. కాకపోతే.. ప్రస్తుతం మార్కెట్ ధరలతో పోల్చితే అవి చాలామందికి సహేతుకంగా కనిపించవచ్చు. మీకూ శిల్పాచీరలకు కావాలంటే.. వెబ్ సైట్ లోకి దూరిపోండి.
29, సెప్టెంబర్ 2014, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి