తెలంగాణ తొలి ఎన్నికల్లో ఓటర్లు ప్రభంజనం సృష్టించారు. భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు. తెలంగాణ మొత్తం మీద చూస్తే 72 శాతం నమోదయ్యింది. పూర్తి వివరాలు అందితే ఇది మరింత పెరగవచ్చు. నల్గొండ 80.56 శాతంతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తొలి గంట నుంచి వెనుకబడ్డ హైదరాబాద్ 53 శాతంతో చివరి స్థానంలో నిలబడింది.
జిల్లాల వారీగా చూస్తే
ఆదిలాబాద్ 78%
నిజామాబాద్ 70%
కరీంనగర్ 76.02%
మెదక్ 77%
రంగారెడ్డి 60%
హైదరాబాద్ 53%
మహబూబ్ నగర్ 73%
నల్గొండ 80.56%
వరంగల్ 75%
ఖమ్మం 78%
భారీగా పోలింగ్ నమోదు కావడంతో, విజయం ఎవరిదన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజయం అంటూ బీరాలు పోతున్నాయి. అటు దేశవ్యాప్తంగానూ భారీగా పోలింగ్ నమోదయ్యింది. ఐదు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి