దేవుడి సేవలో గడుపుతున్న ఓ నన్ తల్లికావడం, ఇటలీల హాట్ న్యూస్ అయిపోయింది. ఎల్ సాల్వేడర్ కు చెందిన నన్ రోక్సానా కొంతకాలంగా ఇటలీలోని రైటీలోని ఓ వృద్ధుల ఆశ్రమంలో పనిచేస్తోంది. బుధవారం ఉదయం కడుపులో నొప్పిగా ఉండడంతో ఆమె అంబులెన్స్ కు కాల్ చేసింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. అసలు తానెలా ప్రెగ్నెంట్ అయ్యానో తెలియనంటోందామె. తన బిడ్డకు ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ పేరును పెట్టుకుంది. తనకు దేవుడిచ్చిన వరంగానే ఆమె చెప్పుకొంటోంది. అయితే, ఆమె పాస్ పోర్ట్ రెన్యువల్ చేయించుకోవడానికి ఎల్ సాల్వెడార్ వెళ్లినప్పుడు గర్భం దాల్చి ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు.
నన్ దగ్గర డబ్బు లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బందే తల్లీబిడ్డలకో కోసం దుస్తులు, చందాలు సేకరిస్తున్నారు. రైటీ మేయర్ సైమన్ , ఆ నన్ ప్రైవసీని అంతా కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అయితే, బిడ్డకు జన్మనించిన కారణంగా ఆశ్రమం నుంచి ఆమెను పంపించి వేస్తున్నట్లు ప్రకటించింది కాథలిక్ చర్చ్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి