23, నవంబర్ 2013, శనివారం
మూలుగుతున్న డబ్బు విలువ రూ.3652 కోట్ల పైమాటే
అక్షరాలా మూడు వేల ఆరు వందల యాభై రెండు కోట్లు.. ఇంత భారీ మొత్తం ఎవరికీ చెందకుండా మన బ్యాంకుల్లో మూలుగుతోంది. ఇదీ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో సేవింగ్ అకౌంట్స్ రూపంలో ఉండడం విశేషం. ఇందులోనూ అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 714 కోట్లు, కెనరా బ్యాంక్ లో 525 కోట్లు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ కూడా డిసెంబర్ 2012 నాటికి మాత్రమే, ఈ ఏడాది చివరివరకూ చూస్తే, మరో 500 నుంచి వెయ్యికోట్లు పెరిగే అవకాశాలున్నాయి బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఖాతాలు ప్రారంభించడం అందులో ఎంతో కొంత డబ్బు జమ చేయడం, ఆ తర్వాత దాన్ని మర్చిపోవడం ఇటీవలికాలంలో బాగా పెరిగిపోయిందట. రెండేళ్ల పాటు నిర్వహణలో లేని ఖాతాల్లో ఉన్న మొత్తాన్ని లెక్కిస్తే ఈ లెక్క తేలింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి