కేంద్ర పెట్రోలియం శాఖ ఎంతోమందికి ఉపయోగపడే ఓ మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్లను పెట్రోల్ బంక్ ల్లో అమ్మాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా ఇది ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుల్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ఆయిల్ కంపెనీల సొంత నిర్వహణలో ఉన్న బంకుల్లో మాత్రమే అమ్ముతారు. మార్కెట్ ధరకు ఈ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 5న బెంగళూరులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. డిమాండ్ ను బట్టి క్రమంగా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరించే అవకాశం ఉంది. మెట్రో నగరాలకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులకు, చిన్న కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేయనుంది. ఇప్పటివర0కూ చిన్న సిలిండర్లను ఆయిల్ కంపెనీలు సరఫరా చేయడంలేదు. అక్రమంగా దుకాణాల దగ్గర చిన్న సిలిండర్లను జనం నింపించుకుంటున్నారు. సిలిండర్‌లో పూర్తిగా గ్యాస్ నిండిందో లేదో కూడా తెలియని పరిస్థితి. పైగా ఇలా అక్రమంగా ఫిల్లింగ్ చేస్తున్న సమయంలో ఎన్నో సార్లు పేలుళ్లు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో అధికారికంగా వీటిని అమ్మడం వల్ల రెండు ఉపయోగాలుంటాయి. ఒకటి సబ్సిడీ సిలిండర్ల దుర్వినియోగం ఆగిపోతుంది. రెండోది ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. కేవలం మెట్రో నగరాలకు, ఆయిల్ కంపెనీల సొంత బంకులకే కాక, అన్ని పెట్రోల్ బంకులకు దీన్ని విస్తరిస్తే జనానికి మరింత లబ్ది చేకూరుతుంది.
చిన్న సిలిండర్ల విక్రయాలతో పాటు, జనానికి మేలు జరిగే మరో నిర్ణయాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. మీ గ్యాస్ సరఫరా దారు సర్వీసు సరిగ్గా లేకపోతే మరో కంపెనీకి మారేలా, గ్యాస్ పోర్టబులిటీని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి సులువుగా వినియోగదారులు మారవచ్చు.
2, అక్టోబర్ 2013, బుధవారం
బంకుకెళ్లండి.. బండ తెచ్చుకోండి
Categories :
5kg cylinder . gas . news . petrol bunks . sale . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి