25, అక్టోబర్ 2013, శుక్రవారం
విలీనంపై నిర్ణయం తీసుకుంటారా..?
టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం మరికాసేపట్లో మొదలుకానుంది. తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికలకు సన్నద్ధతతో పాటు కాంగ్రెస్‌లో వీలీనంపైనా ఈ భేటీలో కీలకచర్చ జరిపే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే, టీఆర్ఎస్ను విలీనం చేస్తానంటూ గతంలో చాలా సార్లు కేసీఆర్ బహిరంగ ప్రకటనలు చేశారు. తీరా ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్ధమవడంతో, ఏం చేయాలన్నదానిపై గులాబీ వర్గాల్లో గుబులు కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కొంతమంది చెబుతుండగా, ఇంతకాలం కష్టపడి నిర్మించిన పార్టీని హస్తగతం చేయడమేమిటన్నది మరికొందరి వాదన. విలీననానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి సంఖ్యే పార్టీలో ఎక్కువగా ఉండడంతో, ఆ మేరకే పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే, తెలంగాణ ప్రక్రియపై కీలక అడుగులు పడుతున్న దశలో కాంగ్రెస్ ను రెచ్చగొట్టే తరహాలో ప్రకటనలు చేయకపోవడమే మంచిదన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులపై ఆయన చేసిన వ్యాఖ్యలు సీమాంధ్రలో పెను ఉద్యమానికి దారి తీయడంతో, విలీనంపై ఇప్పటికిప్పుడు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి