29, అక్టోబర్ 2013, మంగళవారం
ఆ నాలుగూ తేల్చేస్తే విభజిచ్చేస్తాం..
Categories :
bifurcation . GOM . HOME MINISTRY . POLITICS . secret note . seemandhra . telangana . TOP
రాష్ట్ర విభజన వ్యవహారంలో విప్పాల్సిన చిక్కుముడులపై కీలక నివేదికను మంత్రుల బృందానికి హోంశాఖ రహస్యంగా అందించింది. శ్రీకృష్ణ కమిటీతో పాటు, ఇతర మార్గాల ద్వారా సేకరించిన పూర్తి సమాచారాన్ని ఈ నివేదికలో పొందుపరిచారు. రాష్ట్ర విభజన విషయంలో తేల్చాల్సిన నాలుగు ప్రధాన అంశాలను గుర్తించిన హోంశాఖ వాటిని ఎలా పరిష్కరించాలో చెప్పమని మంత్రుల బృందాన్ని కోరింది. అవి, ఆర్టికల్ 371డి మరియు రాష్ట్రపతి ఉత్తర్వులు, జలవనరులు, విద్యుత్ వనరులు, హైదరాబాద్ సిటీ. విభజన విషయంలో ప్రధానమైన అభ్యంతరాలు వీటిపైనే వ్యక్తమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకునే బాధ్యతను మంత్రుల బృందానికే అప్పజెప్పింది హోంశాఖ. మంత్రుల బృందం తీసుకునే నిర్ణయాల ఆధారంగానే విభజన ప్రక్రియలో ముందడుగు పడనుంది. ఇక పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ప్రాథమికంగా అంగీకరించినప్పటికీ, దాన్నే అంతిమనిర్ణయంగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదని మంత్రుల బృందానికి సంకేతాలిచ్చింది. దీంతో రాష్ట్ర విభజన ఏ రకంగా జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ మొదలయ్యింది. నవంబర్ 7వ తేదీన మూడోసారి సమావేశం కానున్న జీవోఎం ఈ నోట్ పై సవివరంగా చర్చించనుంది. జీవోఎంకు హోంశాఖ పంపించిన పూర్తినోట్ ను తదుపరి పోస్ట్ లో చూడొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి