హంసలు దేవుళ్ల దగ్గర ఉండే పక్షులని, అయితే, కాంగ్రెస్ సృష్టించిన హంస కేసీఆర్ అన్నారు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగిన రైతుగర్జన సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పాలు నీళ్లలా కలిసి ఉన్న ఆంధ్రా,తెలంగాణ ప్రజలను విడదీయడానికి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను హంస లా తయారు చేసిందన్నారాయన.
ఉద్యమ పాటలంటే తెలంగాణ పాటలే
ఉద్యమ పాటలంటే తెలంగాణ పాటలే అన్నారు అశోక్ బాబు. తెలంగాణ ఉద్యమ పాటలున్నంత ఊపుగా, సమైక్య పాటలను రాయలేకపోతున్నామని గజల్ శ్రీనివాస్ అన్నారని ఆయన ప్రకటించారు. తెలంగాణ పాటలు వింటే ఉత్సాహం వస్తుందని, వాటిని వినడానికి సమైక్యవాదులకు అహం అడ్డువస్తుందని కానీ, దాన్ని వదలి అంతా తెలంగాణ పాటలు వినాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పుడే సమైక్య ఉద్యమానికి మరింత ఊపు వస్తుందన్నారాయన.
2, అక్టోబర్ 2013, బుధవారం
కాంగ్రెస్ హంస కేసీఆర్ :అశోక్ బాబు
Categories :
apngo . ashok babu . hanuman junction . kcr . krishna district . news . rythu garjana . samaikya protest . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి