పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రికార్డ్ సృష్టించారు. టాలీవుడ్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. మగధీర రికార్డులను బ్రేక్ చేసి, అత్తారింటికి దారేదితో టాప్ స్టార్ తనేనని చాటిచెప్పాడు పవర్ స్టార్.
పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేదీ తొలివారం బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసేసింది. రాష్ట్రంలో తొలివారమే 35 కోట్ల వసూళ్లు సాధించి, అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. కర్నాటక, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కలెక్షన్లు కలుపుకుంటే ఈ మొత్తం 47 కోట్లను దాటుతోంది. ఇప్పటి వరకూ మరే తెలుగు సినిమా ఈ రేంజ్ లో ఫస్ట్ వీక్ కలెక్షన్లను సాధించలేదు. రాంచరణ్ 2009లో నటించిన మెగామూవీ మగధీరే ఇప్పటివరకూ హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ గ్రాసర్ గా ఉండేది. పవర్ స్ట్రోక్ కు ఇప్పుడు ఆ సినిమా కూడా వెనుకబడిపోయింది. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్నా అత్తారింటికి కలెక్షన్లు భారీగా ఉండడం పవన్ సత్తాను తెలియజేస్తోందంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రాంతాల వారీగా అత్తారింటికి దారేది తొలివారం కలెక్షన్లు
నైజాం - 13 కోట్లు
సీడెడ్ - 6.35 కోట్లు
నెల్లూరు - 1.5 కోట్లు
గుంటూరు - 3.2 కోట్లు
కృష్ణా - 2.4 కోట్లు
పశ్చిమ గోదావరి - 2.2 కోట్లు
తూర్పు గోదావరి - 2.6 కోట్లు
ఉత్తరాంధ్ర - 3.5 కోట్లు
కర్నాటక -4.01 కోట్లు
రెస్టాఫ్ ఇండియా - 1.58 కోట్లు
ఓవర్ సీస్ - 8.6 కోట్లు
5, అక్టోబర్ 2013, శనివారం
రాంచరణ్ ను తొక్కేసిన పవన్ కళ్యాణ్
Categories :
all time record . attahrintiki daredi . entertainment . first week collections . pavan . ramcharan . tollywood . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి