16, అక్టోబర్ 2013, బుధవారం
బాక్స్ బద్దలు కొట్టిన బెయిలీ
Categories :
australia . CRICKET . george bailey . india vs australia . sports . TOP
భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జైపూర్ లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు కంగారూల కెప్టెన్ జార్జ్ బెయిలీ. భారత బౌలర్లను కంగారెత్తిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సులుగా సాగిన ఇన్నింగ్స్‌లో (నిజంగానే 6 ఫోర్లు, 3 సిక్సులు) కేవలం 50 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బెయిలీ వీరబాదుడుకి 359 పరుగుల భారీ స్కోర్ ను సాధించింది ఆసీస్. ఆ టీమ్ టాప్ ఆర్డర్ కూడా అద్భుతంగా రాణించింది. మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్థసెంచరీలు సాధించడం విశేషం. ఇలా మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అర్థసెంచరీలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తంమీద కంగారూల దెబ్బకు చెమటలు కార్చారు భారత బౌలర్లు. బౌలింగ్ లో మన టీమ్ ఎంత బలహీనంగా ఉందో ఈ మ్యాచ్ మరోసారి తేటతెల్లం చేసింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి