15, సెప్టెంబర్ 2013, ఆదివారం
మంత్రి టీజీపై చెప్పుల వర్షం
Categories :
attack . congress . kurnool . POLITICS . samaikya protest . tg venkatesh . TOP
రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ కు సొంత పట్టణం కర్నూలులో సమైక్యాంద్ర ఉద్యమ సెగ తగిలింది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన్ను ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఆయన వాహనంపైకి చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. మంత్రి పదవికి టీజీ రాజీనామా చేసి, ఉద్యమంలోకి రావాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో ఆక్రోశానికి గురైన టీజీ.. ఉద్యమ కారులపై మండిపడ్డారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగుస్తులంతా దొంగలేనని విమర్శించారు. సమైక్యవాదంతో పోరాడుతున్న నన్ను అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే దాడులు చేస్తున్నారని విమర్శించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, పోలీసులు రంగంలోకి దిగిన దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి