స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో ఎన్నో రాజ్యాలు, మరెన్నో సంస్థానాలు. అప్పటి కేంద్రమంతి ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్ చొరవకారణంగా ఈ సంస్థానాల విలీనం వేగంగా జరిగింది. అప్పటికి బోంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీలే అతిపెద్ద రాష్ట్రాలుగా నిలిచాయి. అయితే, తెలుగువాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం జరగడంతో 1953లో మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి తెలుగు మాట్లాడేవారికోసం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని 1953లో ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ కాలనీలను కూడా భారత్లో విలీనం చేసుకున్న తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాల విభజనను, పరిపాలనా సౌలభ్యం కోసం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజించారు. 1956లో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించాయి. తమిళనాడు, కర్నాటక, కేరళలూ ఏర్పడడంతో దక్షిణాదికి సరికొత్త రూపం వచ్చింది. 1960లో బోంబే ప్రెసిడెన్సీ మహారాష్ట్ర, గుజరాత్ లుగా విడిపోయింది. 1961లో గోవాకు స్వాతంత్ర్యం రావడంతో, గోవాతో పాటు డయ్యూడామన్, దాద్రానగర్ హవేలీలు భారత్ లో అంతర్భాగమయ్యాయి. 1963లో నాగాలాండ్ కు రాష్ట్ర హోదా దక్కింది. 1966లో పంజాబ్ విభజన జరిగింది. కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ లో కలవగా, కొత్తగా హర్యానా ఏర్పడింది. 1972లో అస్సాం నుంచి మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ లను ఏర్పాటు చేశారు. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచారు. 1975లో సిక్కిం భారత్ లో కలిసింది. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు పూర్తయ్యింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ మొదలయ్యింది.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో రాష్ట్రాల విభజన ఎలా జరిగిందన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడే యానిమేషన్ మ్యాప్ ఇది. (ఐబీఎన్ లైవ్ వెబ్ సైట్ సౌజన్యంతో)
1956 నుంచి ఇప్పటివరకూ చూస్తే, దేశంలోని రాష్ట్రాలు ఎన్నో మార్పులకు లోనయ్యాయి. అప్పట్లో కేవలం 17 రాష్ట్రాలుంటే, ఇప్పుడు తెలంగాణతో కలిపి 29 రాష్ట్రాలయ్యాయి. ఇదంతా కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం దేశ అభివృద్ధి కోసం చేసినవే తప్ప, ప్రాంతాల మధ్య విద్వేషాలను పెంచడానికి చేసినవి కాదు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కూడా అదే దిశలో జరుగుతోంది. పైగా, ఇది ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ప్రాంతం. కాబట్టి, తెలంగాణ ఏర్పాటుతో దేశం ముక్కలైపోతుందని, అశాంతి రగులుతుందని అనుకోవడానికి లేదు.
1, ఆగస్టు 2013, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chakkaga vivarimcharu........