30, జులై 2013, మంగళవారం
మీసముంది కానీ.. మగాడు కాదట!
Categories :
congress . kanimuri bapiraju . POLITICS . seemandhra . telangana . TOP . ttd chairman
మగాడు కాదంటే అపార్థం చేసుకోకండి.. ఇక్కడ మీనింగ్ దమ్ము లేదని. మామూలుగా మూతి మీద మీసముంటే రోషమెక్కువన్న మాట చాలా పాతదే. మగతనానికి, ధైర్యానికి, ధీరత్వానికి మీసాన్ని ప్రతీకగా అనాదిగా చూస్తున్నాం. కానీ, ఈ మీసంతోనే ఆ పెద్దాయనకు పెద్ద చిక్కొచ్చి పడింది. బుర్రమీసాలకు రాష్ట్ర రాజకీయాల్లో పేరుమోసిన లీడర్ కనుమూరి బాపిరాజు. మీసాల బాపిరాజుగానూ ఆయన ప్రతీతి. అలాంటాయనే ఇప్పుడు ఆ మీసాల వల్ల ఉపయోగం లేకుండా పోయిందని తెగ బాధపడుతున్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తుంటే, దానికి బ్రేక్ వేయడానికి సీమాంధ్ర నేతలు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం బాపిరాజు నివాసంలో భేటీ అయ్యి, హైకమాండ్ పై ఎలా ఒత్తిడి తేవాలనేదానిపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంలోనే బాపిరాజు తన మీసాలపై వ్యాఖ్యలు చేశాయి. తనకు మీసాలైతే ఉన్నాయి కానీ, హైకమాండ్ నిర్ణయాన్ని మార్చేంత శక్తిమాత్రం తనకు లేదనేశారు. ఎంపీగా, టీటీడీ ఛైర్మన్ గా ఎంతోమందితో సన్నిహితంగా ఉండే బాపిరాజే అలా అనేసరికి మిగిలిన సీమాంద్ర నేతలూ కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి