15, జూన్ 2013, శనివారం
గులాబీ బాస్ పై అంతా గరంగరం..!
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాయకుడన్నాక, ఉద్యమాన్న ముందుండి నడిపించాలి గానీ, వెనుకుండి మాటలు చెప్పడం కాదంటూ ఇతర పార్టీల నేతలనుంచి తీవ్రస్థాయిలో మాటల దాడిమొదలయ్యింది. ఛలో అసెంబ్లీని కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని, లక్షలాదిగా తరలి రావాలంటూ ప్రతీ చోటా ఢంకా బజాయించి మరీ చెప్పారు కేసీఆర్. కానీ, ఛలో అసెంబ్లీ రోజు ఆయన ఎవరికీ కనిపించలేదు. కనీసం రోడ్డెక్కలేదు.. జనంలో కలవడం ఇష్టం లేదనుకుంటే, అరెస్ట్ అయిన వారిని పరామర్శించడానికైనా పోలీస్ స్టేషన్ కు వెళ్లలేదు. ఓ వైపు అందరూ ఉరుకులు పరుగులుపెట్టి ఒళ్లు హూనం చేసుకుని పోలీస్ స్టేషన్లలో పడిగాపులు కాస్తుంటే.. తెలంగాణ బంద్ అంటూ ఏకపక్షంగా పిలుపిచ్చి మరో కలకలం రేపారు కేసీఆర్. దీంతో ఒళ్లుమండిన బీజేపీ, సీపీఐ ఇతర పార్టీలు బంద్ కు దూరంగా ఉన్నాయి. దీనికి తగ్గట్లే బంద్ ప్రభావం కూడా తెలంగాణ జిల్లాల్లో అంతంత మాత్రంగానే కనిపించింది. పోనీ బంద్ రోజన్నా కేసీఆర్ బయటకు వస్తారనుకుంటే అదీ జరగలేదు. ఉద్యమాన్ని నడిపించే నాయకుడే తెరవెనక్కి వెళ్లిపోతే, ఆయన్ను అనుసరించే వాళ్లు ముందుకెళ్లడం కరెక్టేనా.. కేసీఆర్ జీ జర సోచో..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి