5, ఏప్రిల్ 2013, శుక్రవారం
ఈ రాహుల్.. ఆ రాహులుడవుతాడా?
Categories :
congress . POLITICS . rahul gandhi . TOP
కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ రాహుల్ గాంధీపైనే పెట్టుకుంది. భావి ప్రధానికి ఊహించుకుంటూ, పార్టీకి కొత్త శక్తినిచ్చే గాంధీ కుటుంబ వారసుడిగా భావిస్తోంది. అయితే, రాహుల్ వ్యవహారం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. వారసత్వరాజకీయాలే ఊపిరిగా బతుకుతున్న నెహ్రూ-గాంధీ కుటుంబంలో పుట్టినప్పటికీ, దానిపై తనకు అంత మక్కువ లేదన్న విషయాన్ని వీలైనప్పుడల్లా, బయటపెడుతూనే ఉన్నాడు యువగాంధీ. తాజాగా సీఐఐ సమావేశంలోనూ ఈవిషయాన్ని మరోసారి ప్రస్తావించాడు. తానీ స్థితికి ఆయాచితంగానే వచ్చానని ప్రకటించాడు. తాను భావిప్రధాని అవుతానా లేదా అన్నది అప్రస్తుతం అని ప్రకటించిన రాహుల్, రాజకీయ జీవితంపై అంతులేని వైరాగ్యాన్ని ప్రదర్శించాడు.
అటు కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలపై ఎక్కువగా దృష్టి పెట్టి, స్థానిక భాగస్వామ్యాన్ని పెంచుతానన్నాడు. కేవలం రెండుమూడొందల మంది పార్లమెంటు సభ్యుల చేతిలోనే వందకోట్ల మంది జీవితాలు నిర్ణయమవడం బాధాకరమన్నాడు రాహుల్. సర్పంచ్ స్థాయి నేతలకూ ప్రాధాన్యం పెరిగినప్పుడే దేశం బాగుపడుతుందన్నాడు.
రాహుల్ మాటలు చూస్తుంటే రాజ్యాధికారాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. తల్లిలానే తాను కూడా వచ్చే ఎన్నికల అనంతరం ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పజెప్పి, తాను మాత్రం తెరవెనుక శక్తిగానే మిగిలిపోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. గౌతమబుద్ధుడు పూర్వాశ్రమంలో రాజ్యాన్ని, అధికారాన్ని వదిలి సత్సంగుడిగా మారినట్లు, ఈ రాహుల్ గాంధీ కూడా, రాజకీయాల ఊబినుంచి బయటపడాలని భావిస్తున్నారామో.. ఈ విషయం వచ్చే ఎన్నికల తర్వాత స్పష్టమవుతుంది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి