21, మార్చి 2013, గురువారం
మున్నాభాయ్ మళ్లీ జైలుకు
Categories :
bombay bomb blast . jail . news . sanjay dutt . TOP
1993 బోంబే బాంబు పేలుళ్ల కేసులో గతంలో అరెస్ట్ అయి 18 నెలల కారాగారవాసాన్ని అనుభవించిన హిందీ సినీనటుడు సంజయ్ దత్, మళ్లీ జైలుకు వెళుతున్నాడు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి గాను టాడా కోర్టు అప్పట్లో విధించిన 6 ఏళ్ల జైలు శిక్షను, సుప్రీంకోర్టు ఐదేళ్లకు తగ్గించింది. దీంతో మిగిలిన మూడేళ్ల 8 నెలల జైలుశిక్షను ఆయన అనుభవించాల్సి ఉంది. నాలుగు వారాల్లోగా సంజయ్ లొంగిపోవాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలియగానే సంజయ్ దత్ సోదరి ప్రియాంకదత్ కుప్పకూలిపోయారు. ఆయన భార్య మాన్యత తీవ్ర దుఖంలో మునిగిపోయారు. సంజయ్ ధైర్యంగానే ఉన్నారని, ఈ గడ్డు పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్ తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి