1, మార్చి 2013, శుక్రవారం
అనుష్క లవ్ ఫెయిల్ అయ్యిందా..?
Categories :
anushka . cinema . entertainment . tollywood . TOP
అప్పుడెప్పుడో లోకల్ టీవీలో జయప్రదం కార్యక్రమంలో జయప్రదతో ముచ్చట్లు చెప్పినప్పుడు.. ఓ మంచి వ్యక్తిని చూసుకున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది హాట్ హీరోయిన్ అనుష్క. అదే షోలో వేదం డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొని అనుష్కతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు పైనే కావొస్తుంది. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకోబోతోందంటూ అప్పట్లోనే చాలా వదంతులు వచ్చాయి. ఈ క్రమంలో గోపిచంద్ పేరు కూడా కొన్నాళ్లు వినిపించింది. నాగార్జున తనయుడు నాగచైతన్యతో కూడా అనుష్క క్లోజ్ గా తిరుగుతోందన్న రూమర్లూ పుట్టాయి. కొన్ని ఛానళ్లైతే వారిద్దరికీ పెళ్లంటూ బ్రేకింగ్స్ కూడా ఇచ్చాయి. తెలుగు సినిమాలను వదలి, మద్రాస్ లో కొన్నాళ్లు ఆమె మకాం వేయడంతో ఈ పుకార్లు ఆగిపోయాయి. మళ్లీ ఇప్పుడు అనుష్క పెళ్లి మాటలు ఫిల్మ్ నగర్ లో మొదలయ్యాయి. మిర్చి సినిమా ఇంటర్వ్యూల్లోనూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పింది స్వీటీ. అయితే, లవ్ మ్యారేజ్ కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటున్నానని తేల్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఆమె బంధువుల అబ్బాయినే పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి సినిమా పూర్తయ్యే సరికి 2015 అవుతుంది కాబట్టి, ఆ తర్వాతే రుద్రమదేవి పెళ్లిబాజా మోగనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి