12, ఫిబ్రవరి 2013, మంగళవారం
మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలే వాడి టార్గెట్
మహిళామంత్రులు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలను లక్ష్యంగా చేసుకుని అత్యంత దారుణమైన, మాటల్లో చెప్పలేనంత అసభ్య మెసేజ్ లను పంపిస్తున్న ఓవ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఓ మంత్రి దగ్గర పీఏగా పనిచేసిన కృష్ణ.. ఈ అసభ్య మెసేజ్ లు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో సేకరించిన మహిళా నేతల ఫోన్ నెంబర్లకు, ఉద్యోగం మానేసిన తర్వాత అసభ్య ఎస్ ఎం ఎస్ లు పంపించడం మొదలు పెట్టాడు. అర్థరాత్రి సమయంలో రకరకాల నెంబర్లనుంచి వరసగా మెసేజ్ పంపించి వేధించేవాడు. చాలా కాలంగా ఈ వ్యవహారం సాగుతున్నా, బయటకు చెప్పుకోలేనంత ఘోరంగా మెసేజ్ లు ఉండడంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ టాస్క్ ఫోర్స్ పోలీసులకు నెల రోజుల క్రితం ధైర్యం చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, విస్తృతంగా గాలించి కృష్ణను అరెస్ట్ చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి