4, ఫిబ్రవరి 2013, సోమవారం
బాలయ్య గ్యాప్ కు కారణం ఏమిటో...?
Categories :
balakrishna . entertainment . nayana tara . tollywood . TOP
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీకెరీర్ లో సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుంటున్నాడు. శ్రీమన్నారాయణ సినిమా తర్వాత కొత్త సినిమాకు బాలయ్య సైన్ చేయలేదు. నిరుడు ఆగస్టు 30న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత మరో సినిమాలో బాలయ్య నటించలేదు. దాదాపు ఐదునెలలకు పైగా బాలయ్య ఖాళీగా ఉన్నారు. మధ్యలో రాజకీయంగా కొన్ని పర్యటనలు చేయడం, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించేశారు బాలయ్య.
సింహా తర్వాత హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలయ్య.. ఈ సారిచేయబోయే సినిమా పార్టీకి, తనకు రాజకీయంగా ఉపయోగపడేలా ఉండాలని భావిస్తున్నారు. అందుకే, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మధ్యలోనే తన స్వీయదర్శకత్వంలో ఓ పౌరాణిక సినిమానూ తీయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీరామరాజ్యం తీసిన యలమంచలి సాయిబాబా నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కూడా నయనతారే నటించనుంది. ఈ సినిమా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి