15, జనవరి 2013, మంగళవారం
ప్రాణం తీసిన జాతకం
అవును... జాతకం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జీవితంపై ఎన్నో కలలు కన్న ఓ యువతిని దారుణంగా హత్య చేసింది. విశాఖలో చోటు చేసుకున్న హత్య వెనుక జాతకమే ప్రధాన కారణం పోషించింది. స్లైల్ బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్న భవితను, ఆమె మేనమామ శివకు ఇచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటినుంచో అనుకున్నారు. తీరా ముహూర్తాలు పెట్టుకుందామనుకునేసరికి జాతకాలు కుదరలేదని ఆగిపోయారు. భవిత తనను ఇక పెళ్లిచేసుకోలేదని రగిలిపోయిన శివ.. పట్టపగలే బ్యూటీపార్లర్ కు చేరుకుని భవిత గొంతుకోసి చంపేశాడు. దీన్ని గమనించిన చుట్టుపక్కల వాళ్లు శివను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.
జాతకాలు కలవకుండా పెళ్లిచేస్తే జీవితాంతం కష్టాలు పడుతుందని భావించిన ఆ తల్లిదండ్రులు.. పెళ్లిచేయకపోతే జరిగే అనర్థాన్ని ఆలోచించలేదు. ఇప్పుడు పెళ్లికాకుండానే ఆమె ప్రాణం పోయింది. అందుకే, పెళ్లి చేసేటప్పుడు జాతకాలు కాదు.. మనసులు కలుస్తాయా లేదా అన్నది ఆలోచించాలి... భవిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం. ఇక తాము కోరుకున్నది జరగలేదని ప్రాణాలను సైతం తీసే ఇలాంటి ఉన్నాదులను పబ్లిక్ గానే ఉరితీయాలి. అప్పుడే మరొకడు అలాంటి పని చేయడానికి భయపడతాడు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి