5, డిసెంబర్ 2012, బుధవారం
ఆ కేసులో అలా.. ఈ కేసులో ఇలా
Categories :
gmr . news . norway couple . TOP
నార్వేలోని తెలుగు దంపతులకు శిక్ష పడకుండా చూడడంలో, వారికి సమయానికి సాయం చేయడంలో భారత ప్రభుత్వం విఫలమయ్యింది. అక్కడి చట్టాల్లో తాము జోక్యం చేసుకోలేమని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టంగా ప్రకటించారు. పైగా అది వ్యక్తిగత కేసని, దానికి భారత ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. శిక్షపడేదాకా మరో మంత్రి వాయలార్ రవి కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు. శిక్ష పడ్డాక మాత్రం ఇది అన్యాయమని, భారత్ లో ఉన్న పిల్లలకు నార్వే అధికారులు ఏం సమాధానం చెబుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాయబారితో మాట్లాడటానికి కుదరలేదన్నారు..(ఓ మంత్రికి రాయబారి లైన్లోకి రాకపోవడం విడ్డూరమే!)
ఇక మరోకేసు. మాల్దీవుల్లోని మాలే విమానాశ్రయంలో జీఎంఆర్ కాంట్రాక్టు గురించి. ఇది కూడా ఓ కంపెనీకి మరో దేశానికి సంబంధించిన వివాదమే. పైగా, మరో మలేషియా సంస్థ కూడా ఇందులో భాగస్వామి. కాంట్రాక్ట్ రద్దుపై జీఎంఆర్ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ విషయంలో మాత్రం భారత ప్రభుత్వం స్పందన, నార్వే దంపతుల విషయంలో స్పందనతో పోల్చితే కాస్త విడ్డూరంగానే ఉంది. జీఎంఆర్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దౌత్యపరమైన చర్యలకూ వెనకాడమని కేంద్ర ప్రభుత్వం మాల్దీవుల ప్రభుత్వానికి హెచ్చరికలు పంపింది.
ఈ రెండు కేసుల్లోనూ ఇంత తేడానా..! జీఎంఆర్ కు ఓ కాంట్రాక్ట్ పోతే మరో కాంట్రాక్ట్ దక్కుతుంది. కానీ, చిన్న పిల్లలకు తల్లిదండ్రులు దూరమైతే, ఆ లోటు మరొకరు పూడ్చగలరా..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి