14, డిసెంబర్ 2012, శుక్రవారం
ఈ దేవుడ్ని ఇంకెంతకాలం భరించాలి?
క్రికెట్ దేవుడు మళ్లీ నిరాశపరిచాడు. ఏదో ఒకటీ రెండు సార్లనుకుంటే సరేకానీ.. ఇంగ్లండ్ తో జరుగుతున్ననాలుగు టెస్టుల్లో.. ఏడుసార్లు బ్యాటింగ్ చేసిన సచిన్.. ఒక్కసారి మాత్రమే హాఫ్ సెంచరీ సాధించాడు. మూడు టెస్టుల తర్వాత.. టీమ్ ను సంస్కరించిన సెలెక్టర్లు.. అందరూ ఊహించినట్లే సచిన్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. వరసగా వైఫల్యం చెందుతున్నా.. అతన్ని కొనసాగించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఎప్పటిలానే తనపై విమర్శలకు నాగ్ పూర్ టెస్ట్ లో బ్యాట్ తో సమాధానం చెబుతాడనుకున్న సచిన్.. మళ్లీ అత్యంత దారుణంగా ఔటయ్యాడు. కేవలం రెండే పరుగులు చేసిన సచిన్ క్లీన్ బౌల్డ్ అవ్వడం.. క్రికెట్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ మాత్రం దానికి సచిన్ లాంటి ప్లేయర్ టీమ్ లో అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
ఈ ఏడాది తొమ్మిది టెస్టులు ఆడిన సచిన్ 357 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది యావరేజ్ 23.80. ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా లేదు. సచిన్ కెరీర్ యావరేజ్ 54.32తో పోల్చితే.. ఈ ఏడాది సగటు సగానికి సగం అన్నమాట. ఈ ఏడాది సచిన్ చేసిన అత్యధిక స్కోరు కేవలం 80 పరుగులు. ఈ నేపథ్యంలో సచిన్ రిటైర్ అవ్వడమే మంచిదన్న అభిప్రాయానికి క్రమంగా బలం పెరుగుతోంది. అత్యంత అవమానక రీతిలో సెలెక్టర్లే తనను పక్కన పెట్టే పరిస్థితి రాకుండా సచిన్ చూసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి