1, డిసెంబర్ 2012, శనివారం
నార్వే దంపతులకు ఏడాదిన్నర జైలుశిక్ష?
Categories :
harrasment . news . norway couple . TOP
కన్న కొడుకును మందలించిన పాపానికి నార్వేలో జైలు పాలైన తెలుగు దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలకు కఠిన శిక్ష విధించాలని ఓస్లో పోలీసుల తరపు న్యాయవాదులు కోరారు. చిన్నారులను బెదిరించడం, దాడిచేయడం లాంటి నేరాలు రుజువయ్యాయని, అందుకని చంద్రశేఖర్ కు ఏడాదిన్నర, అనుపమకు 15 నెలల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది. దీనిపై తీర్పును కోర్టు డిసెంబర్ 3న వెలువరించనుంది. ప్యాంట్ తడుపుకోవడం, స్కూల్ నుంచి బొమ్మలు తీసుకువచ్చేయడంపై చంద్రశేఖర్ తన కొడుకును మందలించాడు. మరోసారి ఇలా చేస్తే ఇంటికి పంపించేస్తానన్నాడు. ఈ విషయాన్ని టీచర్స్ కు ఆ అబ్బాయి చెప్పడంతో కేసు నమోదయ్యింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు చంద్రశేఖర్, అనుపమలు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పిల్లలు హైదరాబాద్ లోని వారి బంధువుల దగ్గర ఉన్నారు. పిల్లలను మందలిస్తే తట్టుకోలేరని కఠిన శిక్షలు ప్రతిపాదిస్తున్న నార్వేచట్టాలు.. పిల్లలకు తల్లిదండ్రులు దూరం అయితే, ఎలా ఉండగలుగుతారన్న సాధారణ విషయాన్ని ఆలోచించకపోవడం శోచనీయం. శాంతికి ప్రతీకగా చెప్పుకునే నార్వే, ఇలాంటి దారుణమైన కేసులను పెడుతుండడం, పిల్లలను,తల్లిదండ్రులను విడదీయడం ఏమాత్రం సరికాదు. కనీసం ఇప్పటి నుంచైనా నార్వే వెలుతున్న మన వాళ్లకు అక్కడి చట్టాలపై అవగాహన పెంచడం, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించడానికి భారత ఎంబసీ నడుంకట్టాల్సిన అవసరం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి