23, నవంబర్ 2012, శుక్రవారం
లోక్ సభకు కాదు.. అసెంబ్లీకే వస్తా: బాలయ్య
Categories :
balakrishna . election . POLITICS . tdp . TOP
తన రాజకీయ ప్రవేశంపై కొన్నాళ్లుగా సాగుతున్న వదంతులకు వీడ్కోలు పలికాలు నందమూరి బాలకృష్ణ. వచ్చే ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చాలా రోజుల క్రితమే బాలకృష్ణ ప్రకటించారు. ఆయన్ను అసెంబ్లీకి కాకుండా.. లోక్ సభకు చంద్రబాబు పోటీ చేయిస్తారని కొన్నాళ్లుగా టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో బాబు.. ఢిల్లీలో బాలయ్యంటూ టీడీపీ నేతలు కూడా ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే.. తాను లోక్ సభకు పోటీ చేయనని.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించారు బాలకృష్ణ. దీంతో.. ఆయన గుడివాడ నుంచి పోటీ చేస్తారా.. లేక, తండ్రిలా హిందూపురం నుంచి పోటీ చేస్తారా అన్నది ఆసక్తి కరంగా మారింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి