8, ఆగస్టు 2012, బుధవారం
సహనం కోల్పోయిన సోనియా
Categories :
advani . congress . parliament . POLITICS . sonia . sonia angry . TOP
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే.. అరుదైన దృశ్యం ఆవిష్కృతమయ్యింది. సభలో ఎంత గొడవ జరిగినా కామ్ గా ఉండే మేడం సోనియా.. ఈసారి మాత్రం సహనాన్ని కోల్పోయారు. తన ఆగ్రహాన్ని ముఖకవళికల ద్వారా బయటపెట్టారు. అసోం అల్లర్లపై బీజేపీ నేత అద్వానీ మాట్లాడుతూ..
యూపీఏ ఎన్నిక అక్రమమని ప్రకటించడంతో సోనియా కోపం కట్టలు తెంచుకొంది. అద్వానీ ప్రసంగాన్ని అడ్డుకోమంటూ దాదాపు తొమ్మిది సార్లు కాంగ్రెస్ అధినేత్రి పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు.. అద్వానీ వ్యాఖ్యలు సరికాదంటూ ఆవేశంగా సంజ్ఞలు చేశారు. అటు అద్వానీ వ్యాఖ్యలపైనా తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగుతోంది. 2009 ఎన్నికలకు ముందు జరిగిన నోట్ల కట్టల వ్యవహారాన్ని అవసరంగా ప్రస్తావించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ సూచనతో అక్రమమం అన్న పదాన్ని అద్వానీ ఉపసంహరించుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముందు ముందు చాలా చూడబోతున్నాం. తినబోతూ రుచి అడగడమెందుకూ?